
📌 Key Points
- రాశీ ఖన్నా బ్లాక్ అవుట్‌ఫిట్‌లో మెరుపులు, చూపులతో కుర్రాళ్లకు పిచ్చెక్కించే పోజులు!
- పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీలో రాశీ, శ్రీలీల సందడి, మార్చి 26న విడుదల!
- సిద్ధు జొన్నలగడ్డ సరసన ‘తెలుసు కదా’ మూవీలో రాశీ నటనకు ప్రేక్షకుల నీరాజనం!
- సోషల్ మీడియాలో రాశీ ఖన్నా హల్ చల్, ఫొటోలకు నెటిజన్స్ ఫిదా!
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. తన లేటెస్ట్ ఫొటోలతో హీట్ పెంచేసింది. పవన్ కళ్యాణ్ సరసన నటిస్తూ టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
బ్లాక్ అవుట్‌ఫిట్‌లో రాశీ ఖన్నా మెరుపులు!
యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా(Rashi Khanna) ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ‘ఊహలు గుసగుసలాడే’(OOhalu Gusagusalade) సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది మంచి స్టార్ డమ్ అందుకుంది. ఇక చివరగా ఈ అమ్మడు స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu Kada) మూవీలో నటించి మెప్పించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే ఓకే అనిపించుకున్నప్పటికీ ఈ భామ యాక్టింగ్‌కు మాత్రం ఫుల్ మార్కులే పడ్డాయి.
ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సరసన ‘ఉస్తాద్ భగత్ సింగ్’(Usthad Bhagat Singh) మూవీలో నటిస్తోంది. దీనికి హరీష్ శంకర్(Hereesh Shankar) దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కానుంది. ఇక ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
పవన్ కళ్యాణ్ మూవీలో రాశీ సందడి!
ఈ క్రమంలో తాజాగా రాశీ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ చిన్నది ఇన్‌స్టా(Instagram)లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో బ్లాక్ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చింది. మెడకు బ్లాక్ పెంటెండ్ ఉన్న చైన్‌తో బోల్డ్ స్టిల్స్ ఇచ్చింది. మినిమల్ మేకప్‌తో ఎలిగెంట్‌గా కనిపించింది. ఇక వాటికి.. ‘ఆ భ్రమల రాజభవనం’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈపోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు ఫైర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు!
A post shared by Raashii Khanna (@raashiikhanna)
రాశీ ఖన్నా లేటెస్ట్ అప్డేట్స్ చూశారుగా. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీతో పాటు మరిన్ని విశేషాలతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి!


