|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

భరించలేనంత బాధ.. కర్నూల్‌ ఘటనపై రష్మిక ఎమోషనల్‌

Published: 24-10-2025, 11:21 PM
భరించలేనంత బాధ.. కర్నూల్‌ ఘటనపై రష్మిక ఎమోషనల్‌

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశాన్ని కలచివేసింది. ఈ విషాద ఘటనపై సినీ నటి రష్మిక మందన్న తీవ్రంగా స్పందించారు. తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, మృతుల కుటుంబాలకు ధైర్యాన్ని ప్రసాదించాలని దేవుడిని ప్రార్థించారు.

Key Points

1

కర్నూలు ప్రమాదంపై రష్మిక మందన్న సోషల్‌మీడియాలో తీవ్ర భావోద్వేగ పోస్ట్.

2

తగలబడుతున్న బస్సులో 19 మంది సజీవ దహనం అయ్యారు.

4

మొత్తం 25 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

రష్మిక మందన్న ఆవేదన

కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ఘోర  ప్రమాదం తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్‌ దేశాన్ని కలచి వేసింది. ఈ ఘటన గురించి సినీ నటి రష్మిక మందన్న స్పందించారు. ‘కర్నూలులో జరిగిన ఘోర ప్రమాదం నా గుండెను చాలా తీవ్రంగా బాధపెడుతోంది. తగలబడుతున్న బస్సులో కాలిపోయే ముందు ప్రయాణికుల బాధను ఊహిస్తేనే భయంకరంగా ఉంది. చిన్న పిల్లలతో పాటు చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఒక కుటుంబం మొత్తం  నిమిషాల్లోనే తమ ప్రాణాలు కోల్పోయిందని తెలుసుకుంటే చాలా బాధేస్తుంది. నిజంగా ఈ సంఘటన వినాశకరమైనది. ఇంతటి విషాదాన్ని మిగిల్చిన ఈ ప్రమాదంలో మరణించిన వారికి నా నివాళి. వారి ఆత్మకు శాంతి చేకూరాలి. మృతుల కుటుంబాలకు నా సానుభూతి.. దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్ధిస్తున్నా’అంటూ సోషల్‌మీడియాలో ఆమె ఒక పోస్ట్‌ చేశారు.

ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనం అయ్యారు. నెల్లూరుకు చెందిన అనూష ఆ మంటల్లో ఎలాగైనా తన కుమార్తెను కాపాడుకోవాలని బిడ్డను కౌగిలించుకుని అలాగే కాలిపోయిన దృశ్యం అందరినీ కంటతడి పెట్టించింది. మృతుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక వాసులున్నారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఈ ప్రమాద సమయంలో బస్సు అద్దాలను ధ్వంసం చేసి అతి కష్టంగా 25 మంది  ప్రాణాలతో బయటపడ్డారు.

కర్నూలు బస్సు ప్రమాద వివరాలు

ఘటనలో మరణించిన, బయటపడిన వారు

ఈ భయంకరమైన ప్రమాదం ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబాలకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి లభించాలని అందరం కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.