|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వివాహం తర్వాత రష్మిక సంచలనం! అంతర్జాతీయ వేదికపై మెరిసిన తార!!

Published: 04-04-2026, 2:35 AM
వివాహం తర్వాత రష్మిక సంచలనం! అంతర్జాతీయ వేదికపై మెరిసిన తార!!
  • రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వివాహం తర్వాత ‘రణబాలి’ సినిమాలో కలిసి నటిస్తున్నారు.
  • జపాన్లో క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో రష్మిక వరుసగా రెండోసారి ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు.
  • రెండుసార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రికార్డు సృష్టించారు.
  • పుష్ప సినిమాతో జపాన్‌లో రష్మికకు భారీ క్రేజ్ ఏర్పడింది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహం తర్వాత కూడా తన కెరీర్‌లో దూసుకుపోతున్నారు. జపాన్‌లో జరిగిన క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో వరుసగా రెండోసారి ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ సెలబ్రిటీగా ఆమె నిలిచారు.

విజయ్ దేవరకొండతో రష్మిక వివాహం, సినిమా

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika mandanna) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అందం, అభినయంతో, నటనతో పాన్ ఇండియా వైడ్ గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎట్టకేలకు తన ప్రియుడు, ప్రాణ స్నేహితుడు అయిన విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) తో ఏడడుగులు వేసింది. ఇక వివాహం అనంతరం తమ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి ‘రణబాలి’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేసి రాయలసీమ అభిమానులకు ధన్యవాదాలు కూడా తెలియజేశారు.

ఇదిలా ఉండగా రష్మిక మందన్న ఇప్పుడు వివాహం అనంతరం మరింత జోరు పెంచిందని చెప్పాలి. ఒకవైపు తన కెరియర్ లో భాగంగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారుతుంటే.. మరొకవైపు తన ఖాతాలో అరుదైన గౌరవాలను కూడా ఆమె దక్కించుకుంటుంది. అసలు విషయంలోకి వెళ్తే.. అంతర్జాతీయ ఘనతను ఇప్పుడు ఈమె సొంతం చేసుకుంది. జపాన్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన “క్రంచీరోల్ యానిమే” అవార్డుల వేడుకలో వరుసగా రెండవసారి ప్రజెంటర్ గా వ్యవహరించే అరుదైన అవకాశాన్ని రష్మిక సొంతం చేసుకుంది . 2024 లో ఈ వేదికపై మెరిసిన రష్మిక.. ఇప్పుడు మరొకసారి ఈ వేదికపై అలరించబోతోంది. అలా రెండుసార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రిటీగా రికార్డు క్రియేట్ చేయడం గమనార్హం.

క్రంచీరోల్ యానిమే అవార్డుల్లో రష్మిక

ఇకపోతే యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాల 10వ ఎడిషన్ వేడుక మే 23వ తేదీన జపాన్ రాజధాని అయిన టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖులతో కలిసి రష్మిక విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.ఇకపోతే సుకుమార్ దర్శకత్వంలో , అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రతో రష్మికకు అటు జపాన్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. పైగా ఈ సినిమాతో జపాన్ లో అభిమానులను కూడా సంపాదించుకుంది రష్మిక . ఈ క్రేజ్ కారణంగానే ఈమెకు ప్రెజెంటర్ గా వ్యవహరించే అవకాశం లభించడం గమనార్హం.

జపాన్‌లో రష్మికకు పెరుగుతున్న క్రేజ్

గత రెండు మూడు సంవత్సరాలుగా వరుస సినిమాలు చేస్తూ.. ఆ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ మరింత బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ తో ఏడడుగులు వేసిన ఈమె.. ఒకవైపు విజయ్ దేవరకొండ తో కలిసి రణబాలి సినిమా చేస్తోంది. అలాగే మరో చిత్రం మైసా.. ఇందులో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తోంది . ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ గా వస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రాబోతోంది.

రష్మిక మందన్నకు అంతర్జాతీయంగా వస్తున్న గుర్తింపు ఆమె అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.