
📌 Key Points
- విజయ్ దేవరకొండను రిక్వెస్ట్ చేసేలా చేస్తానన్న రష్మిక కామెంట్స్ వైరల్
- గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో రష్మిక, విజయ్ లవ్ స్టోరీ
- పెళ్లి తర్వాత వైరల్ అవుతున్న రష్మిక, విజయ్ దేవరకొండల పాత ఇంటర్వ్యూ
- సినిమాలో ఛాన్స్ కోసం వెయిట్ చేసేలా చేస్తానన్న రష్మిక సవాల్
టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ రష్మిక మందన్న మరియు విజయ్ దేవరకొండల గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. పెళ్లి తరువాత వీరి పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలోని విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్.
విజయ్, రష్మికల పెళ్లి తర్వాత వైరల్ వీడియో
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోవడంతో ఇప్పుడు వారికి సంబంధించిన ఎన్నో విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టాలీవుడ్ లో అందమైన కపుల్ గా మారిపోయారు వీరిద్దరూ. వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి, నాగ చైతన్య – శోభితా ధూళిపాల వంటి సెలెబ్రిటీ జంటల్లో విజయ్ – రష్మిక కూడా చేరిపోయారు. అయితే వీరికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
వీళ్లిద్దరు తొలిసారి గీత గోవిందం సినిమాలో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ కొట్టడంతో వీరిద్దరికి అభిమానులు పెరిగిపోయారు. అలాగే వీరి మధ్య స్నేహం కూడ పెరిగింది. ఇక ఆ తరువాత డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. ఆ సినిమాతోనే వీరు ప్రేమలో పడ్డారని చెప్పుకుంటారు. అప్పట్నించి తమ ప్రేమను సీక్రెట్ గానే ఉంచారు. కానీ వారు పెట్టిన ఫోటోల వల్ల ఈ జంట దొరికిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇద్దరూ కలిసి ఇతర దేశాల్లో చట్టాపట్టాలేసుకుని తిరిగారు. గతేడాది ఎంగేజ్ మెంట్ చేసుకుని కూడా ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కాగా ఇప్పుడు వీరి పెళ్లి, రిసెప్షన్ అన్నీ పూర్తయిపోయాయి. ఇప్పుడు ఓ పాత వీడియో ట్రెండవ్వడం మొదలైంది.
రష్మిక ఛాలెంజ్: నువ్వు రిక్వెస్ట్ చేయాల్సిందే!
డియర్ కామ్రేడ్ సినిమా సమయంలో జరిగిన ఇంటర్య్వూలోని క్లిప్ ఇప్పుడు వైరల్ అయింది. ఆ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ రష్మికను చాలా ఆటపట్టించాడు. దీంతో కాస్త సీరియస్ అయిన రష్మిక ‘నీతో ఏ సినిమాలోనూ కలిసి నటించను. నువ్వే నాకు కాల్ చేసి రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది చూసుకో, నేను నీతో కలిసి నటించకపోతేనే నా విలువ నీకు తెలుస్తుంది చూడు’ అని అంటుంది.
గీత గోవిందం నుండి మొదలైన ప్రేమ కథ
ఆ ఇంటర్య్వూలోనే రష్మిక మాట్లాడుతూ ‘నువ్వు ఎవరితోనైనా సినిమాలే చేసుకో, ఎవరితోనైనా సినిమాకు సైన్ చేయించుకో. నేను మాత్రం నీతో ఏ సినిమాకు సైన్ చేయను’ అని రష్మిక సరదాగా కోప్పడింది. ఆ వీడియోనే ఇప్పుడు వైరల్ గా మారింది. సినిమాలోనే కలిసి నటించనని చెప్పిన రష్మిక ఇప్పుడు విజయ్ దేవరకొండనే పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవించబోతోంది.
రష్మిక, విజయ్ లవ్ స్టోరీ ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటుంది. వారి పాత వీడియోలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


