|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna: రష్మిక మనసు బంగారం.. ఆ ఒక్క మాటతో డబుల్ రెమ్యునరేషన్.. ఆమె లేకుంటే..

Published: 02-11-2025, 12:35 PM
Rashmika Mandanna: రష్మిక మనసు బంగారం.. ఆ ఒక్క మాటతో డబుల్ రెమ్యునరేషన్.. ఆమె లేకుంటే..

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటించిన “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత ధీరజ్ మొగిలినేని రష్మిక గొప్ప మనసును వెల్లడించారు. రెమ్యూనరేషన్ వద్దన్న ఆమెకు కృతజ్ఞతతో డబుల్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రష్మికపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Key Points

1

రష్మిక మందన్నా "ది గర్ల్‌ఫ్రెండ్" మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

2

నిర్మాత ధీరజ్ మొగిలినేని రష్మిక గొప్ప మనసును ప్రశంసించారు.

4

ఆమెకు కృతజ్ఞతగా రెట్టింపు రెమ్యూనరేషన్ ఇవ్వాలని నిర్మాత యోచిస్తున్నారు.

“ది గర్ల్‌ఫ్రెండ్” సినిమా ప్రమోషన్స్ జోరు

Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ మూవీ “ది గర్ల్ ఫ్రెండ్”. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కన్నడ నటుడు, దసరా మూవీ ఫేమ్ దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నాడు. మరో హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్(Rashmika Mandanna) కీ రోల్ లో కనిపించనుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ రాగా సినిమా కోసం కూడా అదే రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఇక సినిమా విడుదల దగ్గుపడుతున్న నేపధ్యంలో మూవీ టీం వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.

Nara Rohith: నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను.. పెళ్లి తరువాత నారా రోహిత్ ఎమోషనల్ పోస్ట్..

రష్మికపై నిర్మాత ధీరజ్ మొగిలినేని ఆసక్తికర వ్యాఖ్యలు

ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిత్ర నిర్మాత ధీరజ్ మొగిలినేని హీరోయిన్ రష్మికపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ ఇంటర్వ్యూలో ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ..”ది గర్ల్ ఫ్రెండ్ సినిమాకి రష్మిక చాలా ప్రత్యేకం.ఈ సినిమా కోసం ఆమెకు రెమ్యూనరేషన్ ఇవ్వడానికి మేనేజర్ ని కలవడానికి వెళ్లాం. కానీ, ఆయన అందుబాటులో లేరు. దాంతో, నేరుగా రష్మికను కలిసి రెమ్యునరేషన్ గురించి ప్రస్తావించము. దానికి, రష్మిక, ముందు సినిమా రిలీజ్ కానివ్వండి. ఆ తర్వాత రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పారు.

రెమ్యూనరేషన్ వద్దన్న రష్మిక: డబుల్ ఇవ్వనున్న నిర్మాత

ఆ ఒక్క మాటతో రష్మికపై రెస్పెక్ట్ మరింత పెరిగింది. ఈ సినిమాకి ఆమె ఒక్కరూపాయి కూడా రెమ్యూనరేషన్ తీసుకోలేదు. కానీ ఆమెపై ఉన్న కృతజ్ఞతతో రెట్టింపు రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకుంటున్నాము”అంటూ చెప్పుకొచ్చాడు నిర్మాత. దీంతో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్స్ విన్న రష్మిక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. రష్మిక మనసు గొప్పది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

రష్మిక తీసుకున్న ఈ నిర్ణయం ఆమె వ్యక్తిత్వాన్ని, సినిమా పట్ల ఆమె నిబద్ధతను తెలియజేస్తుంది. ఈ వార్త రష్మిక అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది, ఆమె గొప్ప మనసును అందరూ ప్రశంసిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.