|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మగాళ్లకి కూడా పీరియడ్స్ రావాలి.. అప్పుడే అర్థమవుతుంది.. రష్మిక మందన్నా క్రేజీ కామెంట్స్

Published: 04-11-2025, 9:54 AM
మగాళ్లకి కూడా పీరియడ్స్ రావాలి.. అప్పుడే అర్థమవుతుంది.. రష్మిక మందన్నా క్రేజీ కామెంట్స్

నటి రష్మిక మందన్నా తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. జగపతిబాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’ షోలో మగాళ్లకు కూడా పీరియడ్స్ రావాలని అభిప్రాయపడింది. ఆమె క్రేజీ కామెంట్స్, అలాగే త్వరలో విడుదల కానున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా వివరాలు ఈ కథనంలో.

Key Points

1

రష్మిక మందన్నా "మగాళ్లకి కూడా పీరియడ్స్ రావాలి" అంటూ కామెంట్ చేసింది.

2

ఈ వ్యాఖ్యలు జగపతిబాబు హోస్ట్ చేస్తున్న `జయమ్ము నిశ్చయమ్మురా` షోలో చేసింది.

4

రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ.

రష్మిక సంచలన వ్యాఖ్యలు

ఈ ఏడాది ఇండియన్‌ సినిమాల్లో రష్మిక మందన్నా సందడే ఎక్కువగా కనిపించింది. ప్రతి నెల, రెండు నెలకు ఓ మూవీతో ఆడియెన్స్ ముందుకు వస్తోంది. ఆడియెన్స్ ని అలరిస్తూనే ఉంది. ఇప్పటికే ఆమె నుంచి నాలుగు సినిమాలు థియేటర్లోకి వచ్చాయి. గతేడాది డిసెంబర్‌లో `పుష్ప2`తో ఇండియన్ మూవీని షేక్‌ చేసింది. ఇలా ఏడాది `ఛావా`, `సికందర్‌`, `కుబేర`, `థామా` చిత్రాలతో మెప్పించింది. ఇప్పుడు `ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీతో మరోసారి ఆకట్టుకునేందుకు వస్తోంది రష్మిక. ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కాబోతుంది.

ఇదిలా ఉంటే రష్మిక మందన్నా పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. పలు షోస్‌లో సందడి చేస్తోంది. ఇంటర్వ్యూలిస్తోంది. అందులో భాగంగా ఆమె జగపతిబాబు హోస్ట్ గా రన్‌ అవుతున్న `జయమ్ము నిశ్చయమ్మురా` టాక్‌ షోకి వచ్చింది. ఇందులో రష్మిక మందన్నా చిన్ననాటి విషయాలను బయటపెట్టి ఆశ్చర్యపరిచారు జగపతిబాబు. అందులో భాగంగా `స్కూల్‌ పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లో ఒక కంప్లెయింట్‌ వచ్చిందట. ఏంటది?` అని జగపతిబాబు ప్రశ్నించగా, రష్మిక ఆశ్చర్యపోతూ నవ్వులు పూయించింది. ఆమె నవ్వు చూసి `ఓకే, ఇది కన్ఫమ్‌ కింద తీసుకుందామ`ని ఆయన అనగా, `నో నో` అంటూ రష్మిక రియాక్ట్ కావడం ఆకట్టుకుంది.

జయమ్ము నిశ్చయమ్మురా షోలో

`ది గర్ల్ ఫ్రెండ్‌` సినిమా గురించి రష్మిక చెబుతూ ఆ ఫీలింగ్స్‌ ఉంటాయి కదా అండీ, అవి ఎందుకు వస్తాయనేది` అని చెబుతుండగా వెనకాల నుంచి దర్శకుడు రాహుల్‌ రవీంద్రన్‌ వచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు. అనంతరం `మగాళ్లకి కూడా పీరియడ్స్ వస్తే బాగుండని ఫీలైనట్టున్నావ్` అని జగపతిబాబు అడగ్గా, `ఎస్‌` అని రియాక్ట్ అయిన రష్మిక చెబుతూ, మగాళ్లకి ఒక్కసారి పీరియడ్స్ రావాలి, ఆ పెయిన్‌ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే అబ్బాయిలకు కూడా రావాలి` అని తెలిపింది రష్మిక. ఆమె మాటలకు జగపతిబాబు క్లాప్స్ కొట్టడం విశేషం. దీనికి ఆడియెన్స్ కూడా అరుస్తూ క్లాప్స్ కొట్టడంతో రష్మిక ఇచ్చిన రియాక్షన్‌ అదిరిపోయింది.

రష్మిక మందన్నా ప్రస్తుతం నటించిన `ది గర్ల్ ఫ్రెండ్‌` మూవీలో దీక్షిత్‌ శెట్టి హీరోగా నటించారు. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించారు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్‌ మొగిలినేని బ్యానర్‌పై ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు. ఈ శుక్రవారం ఈ మూవీ విడుదల కాబోతుంది. లవ్‌ స్టోరీలోని ఒక కొత్త కోణాన్ని ఇందులో ఆవిష్కరించబోతున్నారు రాహుల్‌ రవీంద్రన్‌. ఇంటెన్స్ లవ్‌ స్టోరీతో ఈ మూవీ రూపొందిందని ఆయన చెప్పడం విశేషం. ఈ మూవీ చూశాక అమ్మాయిలు తమ లవర్స్ విషయంలో ఆలోచనలో పడతారని, తనకున్న ప్రియుడు ఎలాంటివాడో తెలుసుకుంటారని చెప్పారు. మంచివాడైతే ఆ లవ్‌ బలపడుతుందని, లేదంటే బాయ్స్ చుక్కలే అని చెప్పడం విశేషం.

‘ది గర్ల్ ఫ్రెండ్’ విశేషాలు

రష్మిక మందన్నా ప్రస్తుతం `మైసా` అనే లేడీ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తోంది. దీంతోపాటు బాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే విజయ్‌ దేవరకొండతో మరో సినిమా చేస్తోంది. రాహుల్‌ సాంక్రిత్యాన్‌ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌గా ఇది రూపొందుతుంది. వీటితోపాటు పలు క్రేజీ మూవీస్‌కి చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

రష్మిక మందన్నా చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఆమె ధైర్యంగా అభిప్రాయం వ్యక్తం చేయడమే కాకుండా, తన రాబోయే చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఈ నెల 7న ఈ మూవీ థియేటర్లలోకి వస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.