|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

వారియర్ అవతార్‌లో రష్మిక మందన్నా.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన నేషనల్ క్రష్.. టైటిల్ గెస్ చేయండి.. రష్మికను కలవండి

Published: 26-06-2025, 1:49 AM
వారియర్ అవతార్‌లో రష్మిక మందన్నా.. కొత్త సినిమా అనౌన్స్ చేసిన నేషనల్ క్రష్.. టైటిల్ గెస్ చేయండి.. రష్మికను కలవండి

బాక్సాఫీస్ దగ్గర వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన్నా తన కొత్త సినిమాను ప్రకటించింది. ‘వారియర్’ అవతార్‌లో ఆమె లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా టైటిల్‌ను ఊహించమని రష్మిక అభిమానులను కోరింది.

Key Points

1

రష్మిక మందన్నా కొత్త సినిమా ప్రీ-లుక్ పోస్టర్ రిలీజ్!

2

వారియర్ అవతార్‌లో రష్మిక అద్భుతమైన లుక్!

4

అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మాణంలో రష్మిక కొత్త సినిమా!

రష్మిక మందన్నా కొత్త సినిమా

రష్మిక మందన్నా గత మూడు, నాలుగేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర అన్నీ బ్లాక్‌బస్టర్ హిట్స్ అందిస్తూ దూసుకెళ్తోంది. తెలుగులోనే కాదు ఇండియాలోనే ఏ హీరోయిన్ కు సాధ్యం కాని రికార్డు ఇది. ఆమె కథల ఎంపిక అలా ఉంటోంది మరి. తాజాగా తన కొత్త మూవీ అనౌన్స్ అయింది. ఇందులోనూ రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది.

నేషనల్ క్రష్ గా పేరుగాంచిన రష్మిక మందన్నా ఇప్పుడు అసలుసిసలు పాన్ ఇండియా స్టార్ గా నిలుస్తోంది. తాజాగా కుబేర సక్సెస్ తో రష్మిక మరో మెట్టు పైకి ఎక్కింది. ఈ నేపథ్యంలో ఆమె నెక్ట్స్ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను శుక్రవారం (జూన్ 27) ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నారు. గురువారం (జూన్ 26) ప్రీలుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

పవర్‌ఫుల్ వారియర్ లుక్

ఇందులో రష్మిక చాలా పవర్‌ఫుల్ గా ఓ వారియర్ గా కనిపిస్తోంది. ఈ పోస్టర్ ఓ అడవి బ్యాక్‌డ్రాప్ లో ఉంది. ఇందులో ఓ చెట్టు కాలిపోతుండగా పక్కనే రష్మిక చేతిలో ఓ బళ్లెం పట్టుకొని నిల్చొంది. ఆమెకు ఎదురుగా శత్రుమూక దూసుకురావడం చూడొచ్చు. ఆ పోస్టర్ పై హంటెడ్, వూండెడ్, అన్‌బ్రోకెన్ అనే పదాలు రాసి ఉన్నాయి. ఈ పోస్టర్ తోనే రష్మిక కొత్త సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

రష్మిక మందన్నా కొత్త సినిమా ప్రీలుక్ పోస్టర్ చాలా పవర్‌ఫుల్ గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ కథ, అందులో ఆమె పాత్రపై చర్చ మొదలైంది. మరోసారి రష్మిక చాలా శక్తివంతమైన పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. రష్మిక ఈ పోస్టర్ ను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. “నా నెక్ట్స్ మూవీకి టైటిల్ ఏమై ఉంటుందో మీరు ఊహించగలరా? ఎవరూ ఊహించలేరని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ మీరు గెస్ చేస్తే మాత్రం నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను” అని రష్మిక క్యాప్షన్ ఉంచింది.

టైటిల్ గెస్ చేయండి

రష్మిక నటిస్తున్న ఈ కొత్త సినిమాను అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అంతకుమించి ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఎలాంటి సమాచారం మేకర్స్ వెల్లడించలేదు. శుక్రవారం (జూన్ 27) టైటిల్, ఫస్ట్ లుక్ లాంచ్ సమయంలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూ చూడని పాత్రలో రష్మికను చూడబోతున్నామా అన్న ఆసక్తి మాత్రం అభిమానుల్లో నెలకొంది.

రష్మిక మందన్నా కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ శుక్రవారం వెల్లడవుతుంది. వారియర్ అవతార్‌లో ఆమె పాత్ర ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.