|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna: 2 వారాల్లో రష్మిక రెండు సినిమాలు రిలీజ్

Published: 04-10-2025, 10:11 AM
Rashmika Mandanna: 2 వారాల్లో రష్మిక రెండు సినిమాలు రిలీజ్

పాన్ ఇండియా స్టార్ రష్మిక మందన్న వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనుంది. నవంబర్ 7న ‘ద గర్ల్ ఫ్రెండ్’ విడుదల కానుండగా, 21న ‘థామా’ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. విజయ్ దేవరకొండతో ఆమె నిశ్చితార్థం వార్తలు కూడా హాట్ టాపిక్.

Key Points

1

రష్మిక రెండు వారాల వ్యవధిలో రెండు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

2

నవంబర్ 7న రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన 'ద గర్ల్ ఫ్రెండ్' రిలీజ్ కానుంది.

4

విజయ్ దేవరకొండతో రష్మిక రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని, త్వరలో పెళ్లి అని వార్తలు.

రెండు వారాల్లో రెండు రష్మిక సినిమాలు

పాన్ ఇండియా సినిమాలతో అలరిస్తున్న రష్మిక.. రహస్యంగా నిశ్చితార్థం చేసుకుంది. హీరో విజయ్ దేవరకొండతో ఇది జరిగింది. అధికారికంగా బయటకు చెప్పలేదు. అయితే ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ ఉంటుందని విజయ్ టీమ్ చెబుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే త్వరలో రష్మిక పెళ్లి హడావుడిలో పడిపోతుంది. అంతకు ముందు ఈమె నటించిన ఓ రెండు మూవీస్… రెండు వారాల వ్యవధిలో రిలీజ్ కానున్నాయి.

‘ద గర్ల్ ఫ్రెండ్’ విడుదల తేదీ ఖరారు

ఈ ఏడాది ఛావా, సికిందర్, కుబేర సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించిన రష్మిక.. ఈ నెల 21న ‘థామా’ అనే హారర్ మూవీతో థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు ఈమె లీడ్ రోల్ చేసిన ‘గర్ల్ ఫ్రెండ్’ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబరు 07న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నట్లు ఓ స్పెషల్ వీడియో విడుదల చేసి మరీ చెప్పుకొచ్చారు.

రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు

గీతా ఆర్ట్స్ నిర్మించిన ‘ద గర్ల్ ఫ్రెండ్’ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకుడు కాగా.. రష్మిక సరసన దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. ఇప్పటికే ఒకటి రెండు పాటలు రిలీజ్ కాగా రెస్పాన్స్ బాగానే వచ్చింది. నవంబరు 07న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పుడు ప్రకటించారు. ఆ తేదీన చెప్పుకోదగ్గ పెద్ద మూవీస్ అయితే ఏం లేవు.

మొత్తంగా, రష్మికకు రాబోయే రెండు వారాలు చాలా కీలకమైనవి. ఆమె కెరీర్ పరంగా ఈ రెండు సినిమాలు విజయం సాధించాలని, అలాగే విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై త్వరలో స్పష్టత రావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.