|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

స్పెషల్ సాంగ్‌తో కిక్కు ఎక్కించబోతున్న బ్యూటీ.. ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి రీచ్ అవుతాం అంటూ

Published: 03-06-2025, 10:49 AM
స్పెషల్ సాంగ్‌తో కిక్కు ఎక్కించబోతున్న బ్యూటీ.. ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి రీచ్ అవుతాం అంటూ

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తొలిసారిగా స్పెషల్ సాంగ్ లో నటించబోతున్నారు. ప్రముఖ నటుడు ఎన్టీఆర్ సినిమాలో ఈ పాట ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

Key Points

1

రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతున్నారు.

2

ఎన్టీఆర్ నటించిన 'డ్రాగన్' సినిమాలో ఈ సాంగ్ ఉండొచ్చు.

4

రవి బస్రూర్ సంగీతం ఈ పాటకు మరింత హైప్ తెస్తుందని అంచనాలు.

రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్

అనుకోకుండా హీరోయిన్‌గా మారిన రష్మిక మందన్నా నేషనల్ క్రష్ అయిపోయింది. పాన్ ఇండియా హీరోయిన్‌గా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. వరుస బ్లాక్ బస్టర్స్ సొంతం చేసుకుంటూ నంబర్ వన్ కథానాయకురాలిగా దూసుకుపోతుంది. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ కమిట్ అయిన ఈ బ్యూటీ.. ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్‌లో కనిపించబోతుంది. మాస్ మసాలా సాంగ్‌తో మెస్మరైజ్ చేయబోతుంది. హై ఎనర్జీ స్పెషల్ డ్యాన్స్ నంబర్‌తో అభిమానులను ఉర్రూతలూగించనుంది. కాగా ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న డ్రాగన్ మూవీలో రష్మిక స్పెషల్ సాంగ్‌ చేయనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమెను డైరెక్టర్ అప్రోచ్ కాగా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ఇండస్ట్రీ టాక్. వైబ్రెంట్ స్క్రీన్ ప్రజెన్స్, మాసివ్ ఫ్యాన్ బేస్ కలిగిన రష్మిక ఈ సాంగ్‌తో ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుందనే ఉద్దేశంతో మేకర్స్ ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే కొందరు విశ్లేషకులు మాత్రం ఇది ఐటెమ్ సాంగ్ కాదని సినిమాను హై ఎమోషన్‌లో మలుపు తిప్పే పాట అని, రవి బస్రూర్ ట్రెమండస్ మ్యూజిక్ ఇవ్వబోతున్నట్లు చెప్తున్నారు. ఇక దీనిపై స్పందిస్తున్న నందమూరి అభిమానులు ఎన్ని ఎక్స్‌పెక్టేషన్స్ అయినా పెట్టుకోండి రీచ్ అవుతామని కామెంట్స్ చేస్తున్నారు.

ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమా

అభిమానుల ఆసక్తి

రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. ఈ సాంగ్ సినిమాకు ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.