|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విజయ్ కోసం రష్మిక సాహసం! పల్లకిలో ఊరేగింపు… ప్రేమకు గుర్తుగా గ్రాండ్ రీక్రియేషన్!

Published: 28-02-2026, 9:35 AM
విజయ్ కోసం రష్మిక సాహసం! పల్లకిలో ఊరేగింపు... ప్రేమకు గుర్తుగా గ్రాండ్ రీక్రియేషన్!
  • విజయ్, రష్మికల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగింది.
  • రష్మిక పల్లకిలో పెళ్లి మండపానికి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.
  • విజయ్, రష్మికల పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
  • విజయ్ తన జీవితంలో కలలు కనేలా చేశాడని రష్మిక తెలిపింది.

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. రష్మిక పల్లకిలో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉదయ్‌పూర్‌లో రష్మిక, విజయ్ వివాహం

Rashmika Mandanna: రష్మిక మందన్న.. విజయ్ దేవరకొండ వివాహం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహిత మిత్రుల మధ్య రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఈ పెళ్లి ఘనంగా జరిగింది.

పెళ్లి రోజు రష్మిక పాల్కీ లోకి కూర్చుని రావడం అందరి మనసులను దోచుకుంది. సంప్రదాయ దుస్తుల్లో, చిరునవ్వుతో ఆమె కనిపించిన తీరు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. వేళ్లతో హార్ట్ సైన్ చేస్తూ రష్మిక ఇచ్చిన పోజ్ పెళ్లి ఫోటోల్లో ప్రత్యేక హైలైట్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ, రష్మిక నటించిన గీతాగోవిందం సినిమాలో మొదటి పాటలు రష్మిక ఇలానే పల్లకిలో వస్తుంది. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత అదే సీన్ రీ క్రియేట్ చేస్తూ వీళ్ల పెళ్లి జరగడంతో.. అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు.

వివాహ వేదిక అలంకరణ చాలా అందంగా రూపొందించారు. సంప్రదాయ విలువలకు తగ్గట్టుగా, అదే సమయంలో ఆధునిక టచ్‌తో డెకరేషన్ చేశారు. పూల అలంకరణలు, మట్టి రంగుల థీమ్, పాతకాలపు పిత్తల దీపాలు వేదికకు ప్రశాంతతను ఇచ్చాయి. మండపం మొత్తం ఒక ఆత్మీయ వాతావరణాన్ని చూపించింది. విజయ్, రష్మిక పేర్ల మొదటి అక్షరాలతో రూపొందించిన ‘వీఆర్’ డిజైన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పెళ్లి డెకర్‌కు సంబంధించిన కొన్ని చూడని ఫోటోలను డెకరేషన్ టీమ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వెంటనే వైరల్ అయ్యాయి.

పల్లకిలో వచ్చిన రష్మిక మందన్న

తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ రష్మిక చాలా భావోద్వేగంగా ఒక సందేశం రాసింది. “ఇప్పటి నుంచి నా భర్త విజయ్ దేవరకొండ” అని ఆమె పేర్కొంది. నిజమైన ప్రేమ అంటే ఏమిటో, మనసులో శాంతి ఎలా ఉంటుందో విజయ్ తనకు నేర్పాడని చెప్పింది. పెద్దగా కలలు కనడం తప్పు కాదని రోజూ తనకు గుర్తు చేశాడని, తనలో ఉన్న శక్తిని నమ్మేలా చేశాడని తెలిపింది. తన జీవితంలో తాను కలలుగన్న మహిళగా మారడానికి విజయ్ ప్రధాన కారణమని రష్మిక భావోద్వేగంగా వెల్లడించింది.

రష్మిక, విజయ్ చాలా కాలం పాటు తమ మధ్య ఉన్నది కేవలం స్నేహమే అని చెప్పారు. అయితే 2020 నుంచి ఇద్దరూ కలిసి ఎక్కువగా కనిపించడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. 2022లో వారి గురించి పుకార్లు మరింత బలంగా వినిపించాయి. అయినా ఇద్దరూ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. 2025 అక్టోబర్‌లో హైదరాబాద్‌లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం జరిగింది. పెళ్లికి కొద్ది రోజుల ముందే తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

ఇప్పుడు ఈ జంట వివాహ ఫోటోలు సోషల్ మీడియాలో రికార్డు స్థాయిలో లైకులు, షేర్లు పొందుతున్నాయి. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ పెళ్లి ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందని చెప్పొచ్చు.

మొత్తానికి రష్మిక, విజయ్ ల వివాహం ఒక అందమైన వేడుకగా జరిగింది. వారి అభిమానులకు ఇది ఒక పండుగలాంటి వార్త. వారిద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుందాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.