|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Rashmika Mandanna : నా చెల్లికి 13 ఏళ్ళు.. ఆ విషయంలో చాలా బాధగా ఉంది..

Published: 07-07-2025, 6:20 AM
Rashmika Mandanna : నా చెల్లికి 13 ఏళ్ళు.. ఆ విషయంలో చాలా బాధగా ఉంది..

తెలుగు, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక మందన్న, తన వ్యక్తిగత జీవితం గురించి ఆందోళన వ్యక్తం చేసింది. తన 13 ఏళ్ల చెల్లిని సరిగ్గా చూసుకోలేకపోతున్నందుకు ఆమె బాధపడుతోంది. వృత్తి జీవితం వల్ల కుటుంబంతో దూరం పెరుగుతోందని ఆమె తెలిపింది.

Key Points

1

రష్మిక మందన్న వరుస సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉంది.

2

13 ఏళ్ల చెల్లిని చూసుకోలేకపోతున్నందుకు బాధపడుతోంది.

4

ఫ్రెండ్స్‌తో దూరం పెరిగిందని, ఇంటికి వెళ్లలేకపోతున్నందుకు విచారం వ్యక్తం చేసింది.

రష్మిక మందన్న కెరీర్‌లో బిజీ షెడ్యూల్

Rashmika Mandanna : రష్మిక మందన్న వరుస హిట్స్ కొడుతూ స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇటీవలే కుబేర సినిమాతో హిట్ కొట్టింది. రష్మిక చేతిలో తెలుగు, హిందీ సినిమాలు ఉన్నాయి. వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంది. తాజాగా రష్మిక ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం తెలిపింది.

చెల్లితో దూరం, వ్యక్తిగత జీవితంపై ఆందోళన

మీరు హాలిడేస్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు అని ఇంటర్వ్యూలో అడగ్గా రష్మిక సమాధానమిస్తూ..నేను వీకెండ్ హాలిడే కోసం ఏడుస్తాను. నా చెల్లికి 13 ఏళ్ళు. నా కెరీర్ మొదలైనప్పటి నుంచి చెల్లిని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. గతంతో పోలిస్తే ఈ విషయంలో ఇప్పుడు చాలా బాధగా ఉంది. నేను అసలు ఏడాదిన్నరగా ఇంటికే వెళ్ళలేదు. నా సొంత ఊరిని, నా ఫ్రెండ్స్ మిస్ అవుతున్నాను. గతంలో నా ఫ్రెండ్స్ ఏదైనా టూర్ కి వెళ్తే నన్ను కూడా జాయిన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అసలు నన్ను అడగడమే మానేశారు. ప్రొఫెషనల్ లైఫ్ లో సక్సెస్ అవ్వాలంటే పర్సనల్ లైఫ్ త్యాగం చేయాలి. పర్సనల్ లైఫ్ బాగుండాలంటే కెరీర్లో కొన్ని త్యాగం చేయాలి. నేను ఈ రెండిటిని బ్యాలెన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను అని తెలిపింది.

వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత

రష్మిక వరుస షూటింగ్స్ వల్లే తన ఇంటికి వెళ్లలేదని తెలుస్తుంది. దీంతో ఆమె ఫ్యాన్స్ పాపం రష్మిక ఇంటికి కూడా వెళ్లకుండా కష్టపడుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.

వృత్తిపరమైన విజయం కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేయాల్సి రావడం రష్మికకు బాధగా ఉందని, కానీ రెండింటినీ సమతుల్యం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపింది. ఆమె అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.