|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

విరోష్ రిసెప్షన్‌లో రష్మిక చెల్లి సంచలనం! షిమాన్‌ను చూసి షాక్ తిన్న నెటిజన్లు!!

Published: 05-03-2026, 4:05 AM
విరోష్ రిసెప్షన్‌లో రష్మిక చెల్లి సంచలనం! షిమాన్‌ను చూసి షాక్ తిన్న నెటిజన్లు!!
  • విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
  • రష్మిక చెల్లి షిమాన్ మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, అందరి దృష్టిని ఆకర్షించింది.
  • చాలా కాలం తర్వాత చెల్లిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
  • షిమాన్ విశ్వాసం సినిమాలో నటించిన అనికా సురేంద్రన్‌ను గుర్తు చేస్తోందని అభిమానులు అంటున్నారు.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల రిసెప్షన్ వేడుక హైదరాబాద్‌లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకలో రష్మిక చెల్లి షిమాన్ మందన్న ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చాలా కాలం తర్వాత ఆమెను చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

రిసెప్షన్‌లో మెరిసిన రష్మిక చెల్లి

Virosh Reception:ఎట్టకేలకు తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ జంటగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు ఇక నిన్న హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్లో అతిథులు సినీ ప్రముఖులు రాజకీయ నాయకుల సమక్షంలో ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహించారు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ వేడుకల్లో ఎంతోమంది సెలబ్రిటీలు అందరి దృష్టిని ఆకర్షించిన ప్రత్యేకంగా అందరినీ ఆకట్టుకుంది మాత్రం రష్మిక చెల్లి షిమాన్ మందన్న.

రష్మిక మందన్న ఎప్పుడూ కూడా తన సినిమాలతో బిజీ కారణంగా తన కుటుంబానికి చాలా తక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటుంది అలాంటి ఈమెకు తనకంటే సుమారుగా 15 సంవత్సరాల చిన్నదైన చెల్లి ఉందని ఒకప్పుడు చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది అంతేకాదు ఆ చిన్న చెల్లెలితో కలిసి దిగిన క్యూట్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది కూడా ఇక అప్పటినుంచి మళ్ళీ రష్మిక తన చెల్లికి సంబంధించిన విషయాలను ఎక్కడ ప్రస్తావించలేదు. ఇక తనకు బిడ్డ పుడితే ఎలా చూసుకుంటానో తన చెల్లిని కూడా తన బిడ్డలాగే భావిస్తానని గతంలో పలుమార్లు చెప్పింది ఇక సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండడం వల్ల తన చెల్లితో గడిపే మధురమైన క్షణాలను తాను చాలా మిస్ అవుతున్నానని చెప్పి ఎమోషనల్ అయినా సందర్భాలు కూడా ఉన్నాయి.

నెటిజన్ల కామెంట్లు వైరల్

ఆ తర్వాత ఎక్కడా కూడా షిమాన్ ప్రస్తావన తీసుకురాలేదు రష్మిక కానీ ఎట్టకేలకు రష్మిక పెళ్లి వేడుకల్లో షిమాన్ అందరి దృష్టిని ఆకర్షించింది. పైగా తొలిసారి కెమెరా ముందు కనిపించడంతో చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అప్పుడే అంత పెద్దది అయిపోయిందా అంటూ కామెంట్లు చేస్తున్నారు చాలా అందంగా చక్కగా ఉండడమే కాకుండా విశ్వాసం సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అనికా సురేంద్రన్న గుర్తుచేస్తోంది అంటూ రష్మిక అభిమానులు కామెంట్లు చేస్తున్నారు మొత్తానికైతే మార్చి 4వ తేదీన హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ రిసెప్షన్ వేడుకల్లో మెగాస్టార్ ను మొదలుకొని మరి ఎంతోమంది సెలబ్రిటీలో రాజకీయ నాయకులు సందడి చేసిన అందరి దృష్టిని ఆకట్టుకుంది మాత్రం రష్మిక చెల్లి షిమాన్ అని చెప్పడంలో సందేహం లేదు ఇక ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

రిసెప్షన్ వేడుకలో సెలబ్రిటీల సందడి

గీతా గోవిందం సినిమాతో జంటగా ఇండస్ట్రీకి పరిచయమైన వీరు ఆ తర్వాత డియర్ కామ్రేడ్ సినిమా చేసి మరోసారి తమ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో మ్యాజిక్ చేశారు ఇక తర్వాతే ప్రేమలో పడ్డ వీరిద్దరూ దాదాపు 8 సంవత్సరాల పాటు రహస్యంగా తమ ప్రేమను కొనసాగించి ఎట్టకేలకు ఉదయపూర్ లో ఫిబ్రవరి 26 2026న డెస్టినేషన్ వివాహం చేసుకొని అభిమానులను సర్ప్రైజ్ చేశారు. ఇక ప్రస్తుతం రష్మిక మందన్న విజయ్ దేవరకొండ పెళ్లి ఫోటోలతో పాటు రిసెప్షన్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Tags tollywood Vijay Rashmika marriage Share

మొత్తానికి రష్మిక చెల్లి షిమాన్ రిసెప్షన్ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు ఆమెను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.