|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక పెళ్లికి పిలుపు లేని అతిథులు ఎవరు? విజయ్ దేవరకొండతో వివాహంపై సంచలన వ్యాఖ్యలు!

Published: 20-02-2026, 3:35 PM
రష్మిక పెళ్లికి పిలుపు లేని అతిథులు ఎవరు? విజయ్ దేవరకొండతో వివాహంపై సంచలన వ్యాఖ్యలు!
  • రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో జరగనుంది.
  • ప్రమోద్ శెట్టి తనను రష్మిక పెళ్లికి పిలవదని కామెంట్ చేశారు.
  • రక్షిత్ శెట్టి కూడా తన పనుల్లో బిజీగా ఉన్నాడని ప్రమోద్ పేర్కొన్నారు.
  • రష్మిక, రక్షిత్ శెట్టిల మధ్య ప్రేమాయణం ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతో మొదలైంది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండల పెళ్లి ఫిబ్రవరి 26న జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు కొందరిని పిలవరనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నటుడు ప్రమోద్ శెట్టి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

రష్మిక, విజయ్ పెళ్లి వేడుక ఎక్కడ?

Rashmika Vijay Marriage: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna), రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)ని పెళ్లాడబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి పెళ్లికి సంబంధించిన హంగామా మొదలైంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్ వీరి వివాహానికి వేదిక కాబోతోంది. ఇప్పటికే గెస్ట్‌లకు ఆహ్వాన పత్రికలు అందాయి. ఈ ఇద్దరి కుటుంబ సభ్యులతో పాటు, ఇద్దరికీ బాగా దగ్గరైన బంధువులు, నటీనటులు మాత్రమే ఈ వేడుకకు హాజరు కాబోతున్నారనేలా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. పెళ్లి అనంతరం హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌కు మాత్రం ఇండస్ట్రీలోని అందరినీ ఆహ్వానించారనేలా టాక్ నడుస్తుంది. సరే, ఆ విషయం పక్కన పెడితే.. రష్మిక తన వివాహానికి మమ్మల్ని పిలవదంటూ ఇప్పుడో సెలబ్రిటీ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

రష్మిక పెళ్లిపై ప్రమోద్ శెట్టి కామెంట్స్ వైరల్

ఈ మాట అన్నది ఎవరో కాదు.. నటుడు ప్రమోద్ శెట్టి (Pramod Shetty). రష్మిక ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ప్రమోద్ శెట్టి పరిచయం అవుతాడు. రష్మిక మొదట పెళ్లి చేసుకోవాలని అనుకున్న రక్షిత్ శెట్టిని, తనను పెళ్లికి ఆహ్వానిస్తుందని నేను అనుకోవడం లేదని ‘కిర్రిక్ పార్టీ’లో గణేష్ పాత్రలో మెరిసిన ప్రమోద్ శెట్టి చెప్పుకొచ్చారు. మేము కూడా ఆమె ఆహ్వానం కోసం వేచి చూడటం లేదని, మా పనుల్లో బిజీగా ఉన్నామని ఆయన అన్నారు. రక్షిత్ శెట్టి కూడా తన సినిమాల పనుల్లో నిమగ్నమై ఉన్నాడని, తను ఇంకా రష్మికను గుర్తు చేసుకోవడం లేదని, ఎప్పుడో మరిచిపోయాడని ప్రమోద్ శెట్టి తన తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రమోద్ శెట్టి చెప్పిన ఈ మాటలు టాలీవుడ్‌లో సైతం హాట్ టాపిక్‌‌గా మారాయి. దీంతో అసలు రక్షిత్, రష్మికల వివాహం ఆగిపోవడానికి కారణం ఏమిటని అంతా సెర్చింగ్ మొదలు పెట్టారు.

రక్షిత్, రష్మికల మధ్య బంధం గురించి ప్రమోద్

శుభమా అంటూ పెళ్లి చేసుకోవడానికి రష్మిక సిద్ధమవుతుంటే, కావాలని కొందరు తన పాత పరిచయాలను, జ్ఞాపకాలను తోడుతూ హాట్ టాపిక్ అయ్యేలా చేస్తున్నారు. ఇది కావాలని చేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. ‘కిర్రిక్ పార్టీ’ సినిమాతోనే రష్మిక ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమా అనంతరం రక్షిత్ శెట్టి, రష్మికల మధ్య కొంతకాలం ప్రేమాయణం నడిచింది. ఆ ప్రేమను పెద్దల అంగీకారంతో పెళ్లి వరకు తీసుకెళ్లారు. ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది.. తీరా పెళ్లి పీటల మీదకు వెళ్లాల్సిన టైమ్‌లో సడెన్‌గా రష్మిక మందన్నా తన నిర్ణయం మార్చుకుంది. అప్పటి నుంచి కన్నడ ఇండస్ట్రీకి కూడా ఆమె దూరమైంది. ఆ సినిమా తర్వాత ఆమె కన్నడలో మహా అయితే రెండు మూడు సినిమాలు మాత్రమే చేసి ఉంటుంది. ‘ఛలో’ అంటూ టాలీవుడ్‌కి వచ్చేసింది. అయితే వారి పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటనేది ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇక టాలీవుడ్‌లో రష్మిక, విజయ్‌ల ప్రేమాయణం అందరికీ తెలిసిందే.

రష్మిక పెళ్లి వార్తలు టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. పాత జ్ఞాపకాలు, పరిచయాలు తెరపైకి వస్తుండటంతో ఈ వివాహం మరింత ఆసక్తికరంగా మారింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.