|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రష్మిక, విజయ్ పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్! మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి సంచలన పోస్ట్ వైరల్!

Published: 23-02-2026, 7:36 AM
రష్మిక, విజయ్ పెళ్లి వేడుకలో ఊహించని ట్విస్ట్! మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి సంచలన పోస్ట్ వైరల్!
  • విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్‌లో జరగనుంది.
  • విజయ్, రష్మికల పెళ్లి వార్తలపై రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి స్పందించారు.
  • కిరిక్ పార్టీ సినిమాతో రష్మిక, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు, ఆ తర్వాత నిశ్చితార్థం కూడా జరిగింది.
  • కొన్ని కారణాల వల్ల రష్మిక, రక్షిత్ శెట్టి విడిపోయారు, ప్రస్తుతం రష్మిక విజయ్‌ను వివాహం చేసుకోబోతున్నారు.

టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం. వీరి పెళ్లి ఫిబ్రవరి 26న ఉదయపూర్ ప్యాలెస్‌లో జరగబోతుంది. ఈ నేపథ్యంలో రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

విజయ్, రష్మికల పెళ్లి వేడుక వివరాలు

Rashmika -Vijay: టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వెడ్డింగ్ విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)రష్మికల(Rashmika) వివాహం మరి రెండు రోజులలో జరగబోతున్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ ఆఫ్ విరోష్ పేరిట ఈ వివాహ వేడుకలు ఎంతో ఘనంగా జరగబోతున్నాయి. ఈ కార్యక్రమానికి ఉదయపూర్ ప్యాలెస్ వేదిక కాబోతోంది. విజయ్ దేవరకొండ రష్మికతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఉదయపూర్ చేరుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 26వ తేదీ ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అందుకు సంబంధించిన విషయాన్ని విజయ్ దేవరకొండ రష్మిక అధికారికంగా కూడా తెలియజేశారు.

వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో రష్మిక విజయ్ దేవరకొండకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రష్మిక మాజీ ప్రియుడు రక్షిత్ శెట్టి (Rakshith Shetty)గతంలో రష్మిక గురించి చేసిన ఒక ఓల్డ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రష్మిక రక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో రష్మికకు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

రష్మిక – రక్షిత్ శెట్టిల ప్రేమ కథ

ఇలా వీరిద్దరూ తమ మొదటి సినిమా సమయంలోనే ప్రేమలో పడటం, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది.. రక్షిత్ శెట్టి రష్మికల నిశ్చితార్థపు వేడుక కూడా అప్పట్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. తర్వాత పలు మనస్పర్ధలు కారణంగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. అప్పటినుంచి ఈమె కెరియర్ పై ఫోకస్ పెట్టి మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండతో పెళ్లికి సిద్ధమయ్యారు. ఇలా విజయ్ రష్మిక పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో గతంలో రష్మికకు తనకు ఉన్న రిలేషన్ గురించి రక్షిత్ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

రష్మికకు ఎలాంటి సంబంధం లేదు..

రక్షిత్ శెట్టి వైరల్ పోస్ట్ వెనుక అసలు కారణం

ఈ పోస్టులో భాగంగా రక్షత్ శెట్టి రష్మిక గురించి మాట్లాడుతూ..” నేను నా పని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనుకుంటున్నాను. సోషల్ మీడియాకి కూడా దూరం అవుతున్నాను. సోషల్ మీడియాకు దూరం కావడానికి రష్మిక మందన్నకు ఎలాంటి సంబంధం లేదంటూ” రక్షిత్ శెట్టి గతంలో చేసిన పోస్టును ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇక రష్మిక విజయ్ దేవరకొండ తమ పెళ్లి తేదీని ప్రకటించినప్పటికీ ఈ పెళ్లి విషయంపై రక్షిత్ పూర్తిగా మౌనం వహించారే తప్పా ఏ విధమైనటువంటి స్పందన వెల్లడించలేదు. రష్మికతో నిశ్చితార్థం బ్రేకప్ అయిన తర్వాత పూర్తిగా రక్షిత్ రష్మికకు దూరంగా ఉంటున్నారనే తెలుస్తుంది. పలు ఇంటర్వ్యూలలో ఈయన రష్మిక గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో తనకు పెద్దపెద్ద కలలు ఉన్నాయని, తన కలలు నిజం కావాలి అంటూ రక్షిత్ కోరుకోవటం విశేషం.

మొత్తానికి రష్మిక, విజయ్ దేవరకొండల పెళ్లి వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. రక్షిత్ శెట్టి పాత పోస్ట్ వైరల్ కావడంతో ఈ పెళ్లికి మరింత ఆసక్తి నెలకొంది. వారి వివాహ బంధం ఎలా ఉంటుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.