
📌 Key Points
- విజయ్, రష్మిక పెళ్లిలో 2 నుంచి 3 కేజీల బంగారు ఆభరణాలు!
- టెంపుల్ స్టైల్ జ్యూవెల్లరీ కోసం రూ. 7 కోట్ల వరకు ఖర్చు చేశారట!
- హైదరాబాద్ స్వర్ణకారుడు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలు!
- రష్మిక, విజయ్ రాయల్ వెడ్డింగ్ లుక్ వైరల్!
టాలీవుడ్ లవ్ బర్డ్స్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్. వీరి పెళ్లికి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతోంది. ముఖ్యంగా రష్మిక, విజయ్ ధరించిన ఆభరణాల గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
టెంపుల్ జ్యూవెల్లరీతో రాయల్ లుక్!
రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండ పెళ్లి టాలీవుడ్‌లోనే కాదు, దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతటి ఘనంగా ఇప్పటి వరకు ఏ సెలబ్రిటీ మ్యారేజ్ చేసుకోలేదు. దీంతో వీరి పెళ్లి గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఆ కల్చర్, ఆ విధానం గురించి అంతా గొప్పగా చెప్పుకుంటున్నారు. దీంతో ఇది టాప్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అదే సమయంలో ఎక్కువగా మాట్లాడుకునే పెళ్లి కూడా ఇదే.
తమ పెళ్లిలో టెంపుల్ స్టయిల్ గోల్డ్ జ్యూవెల్లరీని ధరించారు రష్మిక, విజయ్. ఈ టెంపుల్-స్టైల్ గోల్డ్ జ్యువెలరీని ప్రత్యేకంగా చేయించారు. దీని ఖరీదు రూ.4 నుంచి 7 కోట్ల మధ్య ఉంటుందట. అవును, మీరు చదివింది నిజమే. ఈ నగలు 2 నుంచి 3 కిలోల బరువు ఉన్నాయని, వీటి తయారీకి పది నెలలకు పైగా పట్టిందని చెబుతున్నారు. ప్రతి డిజైన్‌ను ఎంతో శ్రద్ధగా రూపొందించారు.
హైదరాబాద్‌లో ప్రత్యేకంగా డిజైన్!
ఈ నగలను హైదరాబాద్‌కు చెందిన ఓ ప్రముఖ స్వర్ణకారుడు డిజైన్ చేశాడట. ఆయన సంప్రదాయ సౌత్ ఇండియన్ టెంపుల్ స్టైల్స్‌కు పెట్టింది పేరు. రష్మిక పెళ్లి దుస్తుల్లో భాగంగా పొడవైన బంగారు హారాలు, అందంగా డిజైన్ చేసిన ఒడ్డాణం, భారీ గాజులు, పెద్ద జుంకాలు, పెద్ద పాపిడి బిళ్ల ధరించింది.
రష్మిక ధరించిన ప్రతి ఆభరణంలో టెంపుల్ ఆర్కిటెక్చర్ స్ఫూర్తి కనిపిస్తుంది. ఈ నగలన్నీ ఆమెకు ఆధునిక మహారాణి రూపాన్ని ఇచ్చాయి. దీంతో ఆమె యువరాణిలా మెరిసిపోయింది. అందరి దృష్టిని ఆకర్షించింది.
వైరల్ అవుతున్న VIROSH వెడ్డింగ్!
విజయ్ కూడా ఆమెకు ఏమాత్రం తీసిపోని విధంగా రాజసం ఉట్టిపడే బంగారు ఆభరణాలు ధరించాడు. అతను మెడలో కాసుల మాల, చెవులకు సంప్రదాయ కడుక్కన్, రాయల్ వెడ్డింగ్ డ్రెస్‌కు నప్పేలా అదిరిపోయే గోల్డ్ చైన్స్ వేసుకున్నాడు. ఈ మ్యాచింగ్ నగలు వీరి పెళ్లి వేడుకకు మరింత శోభను తెచ్చాయి.
రష్మిక, విజయ్ పెళ్లి టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.


