|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ratsasan : భయంకరమైన మర్డర్ అండ్ థ్రిల్లర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది.. మరోసారి వణకడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్

Published: 07-07-2025, 10:33 AM
Ratsasan : భయంకరమైన మర్డర్ అండ్ థ్రిల్లర్ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది.. మరోసారి వణకడానికి సిద్ధంగా ఉండండి అంటూ పోస్ట్

విష్ణు విశాల్ నటించిన ‘రాట్సాసన్’ అనే మర్డర్ థ్రిల్లర్ చిత్రం తమిళంలోనే కాకుండా తెలుగులో ‘రాక్షసుడు’గా విజయవంతమైంది. తాజా వార్తల ప్రకారం, ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుందని తెలుస్తోంది.

Key Points

1

విష్ణు విశాల్ నటించిన ‘రాట్సాసన్’ సినిమాకు సీక్వెల్ రాబోతోంది.

2

2026లో ఈ భయానక థ్రిల్లర్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

4

క్రైమ్ థ్రిల్లర్ ప్రేమికులు ఈ వార్తతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాట్సాసన్ సీక్వెల్ విడుదల తేదీ

విష్ణు విశాల్ (Vishnu Vishal) ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ అండ్ థ్రిల్లర్ మూవీ ‘రాట్సాసన్’ (Ratsasan). రామ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ తమిళ మూవీలో అమలా పాల్, శరవణన్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రలో నటించారు. 2018 అక్టోబర్‌లో రిలీజైనా ఈ చిత్రం మంచి సక్సెస్‌ను అందుకుంది. దీంతో ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ కూడా చేశారు. ఇక ఇదే మూవీ తెలుగులో ‘రాక్షసుడు’ అనే పేరుతో రిలీజైంది. తెలుగు వెర్షన్‌లో ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించగా.. రమేష్ వర్మ దర్శకత్వం వహించాడు. తెలుగులో 2019లో రిలీజై సస్పెన్సింగ్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటుంది. అలాంటి ఈ మూవీ ఇప్పుడు సీక్వెల్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ‘రాట్సాసన్’ సీక్వెల్‌కు సర్వం సిద్ధం.. 2026లో భారతదేశపు అత్యంత భయానక థ్రిల్లర్ తిరిగి వస్తుంది.. మరోసారి వణకడానికి సిద్ధంగా ఉండండి’ అంటూ ప్రస్తుతం ఓ పోస్ట్ నెట్టింట దర్శనమివ్వగా.. క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లింక్

విష్ణు విశాల్ మరోసారి భయపెట్టడానికి సిద్ధం

రాక్షసుడు సినిమా విజయం తర్వాత సీక్వెల్

విష్ణు విశాల్ నటించిన రాట్సాసన్ సినిమా సీక్వెల్ వార్తతో అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. 2026లో విడుదల కానున్న ఈ చిత్రం మరింత ఉత్కంఠను కలిగిస్తుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.