|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Ravi Teja 76: రవితేజ సినిమా పేరు మారింది.. ఇప్పుడు ‘అనార్కలి’ కాదు.. కొత్త టైటిల్ భలే ఉందిగా!

Published: 04-10-2025, 11:19 AM
Ravi Teja 76: రవితేజ సినిమా పేరు మారింది.. ఇప్పుడు ‘అనార్కలి’ కాదు.. కొత్త టైటిల్ భలే ఉందిగా!

రవితేజ 76వ సినిమా టైటిల్‌పై ఆసక్తికరమైన వార్త బయటపడింది. మొదట ‘అనార్కలి’ అనుకున్న చిత్రానికి, ఇప్పుడు ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే కొత్త టైటిల్‌ను ఖరారు చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రానున్న ఈ ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయం.

Key Points

1

రవితేజ 76వ సినిమా టైటిల్ 'అనార్కలి' నుండి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'గా మారింది.

2

కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఫ్యామిలీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది.

4

వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

రవితేజ 76: కొత్త టైటిల్ ఏంటి?

Ravi Teja 76: మాస్ మహారాజ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ మాస్ జాతర. భాను భోగవరపు తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా తరువాత రవితేజ సెన్సిబుల్ చిత్రాల దర్శకుడు కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేస్తున్నాడు. రవితేజ(Ravi Teja 76) కెరీర్ లో 76వ సినిమాగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలయ్యింది.

Rahul Ramakrishna: కేసీఆర్ కంబ్యాక్.. గాంధీ అసలు మహాత్ముడే కాదు.. సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ తో అకౌంట్ డిలీట్..

రవితేజ జానర్ కాకపోయినా..

తాజాగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకి ముందుగా అనార్కలి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. రవితేజ టైపు మాస్ కంటెంట్ తో కాకుండా ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా రానుంది. అందుకే ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ ను అనుకున్నారట. కాకపొతే తాజా సమాచారం మేరకు.. ఈ సినిమా టైటిల్ ను చేంజ్ చేశారట. కొత్తగా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే వినూత్న టైటిల్ ను ఫిక్స్ చేశారట. కామన్ గా మైకులలో చెప్పినప్పుడు ఇలా “భర్త మహాశయులకు విజ్ఞప్తి” అనే మాత్రం మనం వింటూనే ఉంటాం. అలాంటి ఫన్నీ టైటిల్ ఈ సినిమా కోసం ఫిక్స్ చేయడం చాలా కొత్తగా ఉంది. చాలా క్యాచీగా ఉంది ఉంది అంటున్నారు ఆడియన్స్.

విడుదల & నటీనటులు వివరాలు

ఇక చాలా గ్యాప్ తరువాత రవితేజ ఫ్యామిలీ ఎమోషన్స్ తో సినిమా చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా నేటితరం భర్తలకు కనెక్ట్ అయ్యేలా కథను సిద్ధం చేశాడట దర్శకుడు కిషోర్ తిరుమల. ఆ పాయింట్ నచ్చడంతోనే వెంటనే ఈ కథకు ఒకే చెప్పేశాడట రవితేజ. నిజానికి ఇది రవితేజ జానర్ కాదు. కానీ, కిషోర్ తిరుమల చెప్పిన కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట రవితేజ. ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ, అషికా రంగనాథ్‌ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

రవితేజ జానర్‌కు భిన్నంగా వస్తున్న ఈ సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ప్రేక్షకుల్లో ఉత్సుకత రేపుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.