|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రవితేజ ‘ఇరుముడి’: రీమేక్ రిస్క్ చేస్తున్నారా? మళ్ళీ ఫ్లాప్ అవుతుందా?

Published: 27-01-2026, 4:05 AM
రవితేజ 'ఇరుముడి': రీమేక్ రిస్క్ చేస్తున్నారా? మళ్ళీ ఫ్లాప్ అవుతుందా?
  • రవితేజ, శివ నిర్వాణ కాంబినేషన్‌లో ‘ఇరుముడి’ సినిమా వస్తోంది.
  • ఈ సినిమా మలయాళ చిత్రం ‘మాలికాపురం’ రీమేక్ అని వార్తలు వస్తున్నాయి.
  • ‘ఇరుముడి’ పోస్టర్‌లో రవితేజ అయ్యప్ప దీక్షలో ఉన్నట్టు కనిపిస్తున్నారు.
  • సినిమా రీమేక్ అయితే, రవితేజ మళ్ళీ రిస్క్ చేస్తున్నట్టేనా అని అభిమానుల్లో ఆందోళన.

మాస్ మహారాజా రవితేజ వరుస డిజాస్టర్ల తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఇరుముడి’ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా మలయాళంలో వచ్చిన ‘మాలికాపురం’ సినిమాకు రీమేక్ అని వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇరుముడి సినిమా రీమేక్ వివాదం

Irumudi Movie: మాస్ మహారాజా రవితేజ (Raviteja) గత కొంతకాలంగా వరుస డిజాస్టర్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఎన్నో అంచనాల నడుమ రవితేజ కొత్త సినిమాలు విడుదలవుతున్నప్పటికీ ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకో లేకపోయినా పర్వాలేదు అనిపించుకుంది.. ఈ నేపథ్యంలోనే రవితేజ తన కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వెల్లడించారు.. జనవరి 26వ తేదీ రవితేజ పుట్టినరోజు కావడంతో రవితేజ మజిలీ దర్శకుడు శివానిర్వాన డైరెక్షన్లో రాబోతున్న సినిమా టైటిల్ విడుదల చేశారు.

ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ ఫిక్స్ చేయడమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో ఈ పోస్టర్ అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇరుముడి దీక్షలో ఉన్న రవితేజ చిన్నారిని ఎత్తుకొని ఉన్నటువంటి ఈ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా తండ్రి కూతురి నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఇన్ని రోజులు తన యాక్షన్, కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన ఒక్కసారిగా రూట్ మార్చడంతో రవితేజ ఈ సినిమాతో సక్సెస్ కొట్టబోతున్నారని అభిమానులు కూడా భావించారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల అయిందో లేదో ఈ సినిమా రీమేక్ సినిమా అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

మాలికాపురం సినిమాతో పోలికలు

రవితేజ శివ నిర్వాణ (Shiva Nirvana)కాంబినేషన్లో రాబోతున్న ఇరుముడి(Irumudi) సినిమా మలయాళం లో 2022వ సంవత్సరంలో విడుదలైన మాలికాపురం(Malikapuram) సినిమాను పోలి ఉందని ఈ సినిమాకు రీమేక్ చిత్రమే ఇరుముడి అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇక మాలికాపురం సినిమా కూడా అయ్యప్ప దీక్ష చిన్నారులు శబరిమల యాత్రకు సంబంధించిన నేపథ్యంలోనే ఉంది ఈ తరుణంలోనే ఇరుముడి సినిమా మాలికాపురం సినిమాకు రీమేక్ సినిమాగా రాబోతోందా అంటూ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

హీరోయిన్ గా ప్రియ భవాని శంకర్..

రవితేజ మళ్ళీ రిస్క్ చేస్తున్నారా?

ఇలా ఈ సినిమా రీమేక్ సినిమా అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మరి కొంతమంది ఇది రీమేక్ కాదని ఈ వార్తలను ఖండిస్తున్నారు. ఇరుముడి సినిమా మలయాళ చిత్రానికి రీమేక్ సినిమానా లేదా అనేది తెలియాలి అంటే దర్శకుడు స్పష్టత ఇవ్వాల్సి ఉంది ఒకవేళ రీమేక్ సినిమానే అయితే నిజంగానే రవితేజ మళ్ళీ రిస్క్ చేయబోతున్నారనే చెప్పాలి. ఈ సినిమాలో రవితేజకు జోడిగా ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జీవి ప్రకాష్ సంగీత సారథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాని ఈ ఏడాదిలోనే విడుదల చేసేలాగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు.

మొత్తానికి ‘ఇరుముడి’ సినిమా రీమేక్ కాదా అనేది తెలియాలంటే దర్శకుడు శివ నిర్వాణ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజంగానే రీమేక్ అయితే రవితేజ మరోసారి రిస్క్ చేస్తున్నట్లే అని చెప్పవచ్చు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.