|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: రవితేజ సన్నగా ఎలా అయ్యాడు? వైరల్ అవుతున్న మాస్ మహారాజ లేటెస్ట్ లుక్!

Published: 04-03-2026, 11:05 PM
షాకింగ్: రవితేజ సన్నగా ఎలా అయ్యాడు? వైరల్ అవుతున్న మాస్ మహారాజ లేటెస్ట్ లుక్!
  • మాస్ మహారాజ రవితేజ లేటెస్ట్ లుక్ వైరల్: అభిమానులకు షాక్!
  • విజయ్ దేవరకొండ, రష్మిక రిసెప్షన్‌లో సన్నగా కనిపించిన రవితేజ.
  • శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ ‘ఇరుముడి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
  • కార్తీక మాసంలో విడుదల కానున్న ‘ఇరుముడి’: అయ్యప్ప భక్తుడిగా రవితేజ!

మాస్ మహారాజ రవితేజ సరికొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. రీసెంట్ గా జరిగిన ఒక వేడుకలో రవితేజ చాలా సన్నగా కనిపించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు రవితేజ ఇలా ఎందుకు మారాడో ఇప్పుడు చూద్దాం.

వైరల్ అవుతున్న రవితేజ లేటెస్ట్ లుక్స్

సన్నబడిన రవితేజ మాస్ మహారాజ కొత్త లుక్స్ వైరల్ ఆ సినిమా కోసమేనా

Raviteja : మాస్ మహారాజ రవితేజ ఇటీవల ఎప్పుడో అడపాదడపా హిట్స్ కొడుతున్నాడు కానీ వరుసగా ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఇటీవల సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో వచ్చి పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం రవితేజ శివ నిర్వాణ దర్శకత్వంలో ఇరుముడి అనే సినిమా చేస్తున్నాడు.

‘ఇరుముడి’ సినిమా కోసమేనా ఈ మార్పు?

రవితేజ రీసెంట్ లుక్స్ వైరల్ గా మారాయి. నిన్న రాత్రి జరిగిన విజయ్ – రష్మిక రిసెప్షన్ కి రవితేజ హాజరయ్యాడు. ఈ ఈవెంట్ నుంచి రవితేజ ఫొటోలు, వీడియోలు చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. రవితేజ చాలా సన్నగా అయిపోయాడు. ఎప్పుడూ ఉండేదానికన్నా రవితేజ బాగా సన్నపడిపోవడంతో ఏంటి ఇలా అయిపోయాడు అని ఆశ్చర్యపోతున్నారు.

ఈ రిసెప్షన్ నుంచే కాక ఇటీవల ఇరుముడి సెట్ నుంచి లీక్ అయిన ఫోటోలలో కూడా రవితేజ చాలా సన్నగానే కనిపించాడు. దీంతో నిజంగానే ఇరుముడి సినిమా కోసమే అని అనుకుంటున్నారు. అయితే ఇటీవల భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రమోషన్స్ లో కూడా రవితేజ బాగానే ఉన్నాడు. ఇప్పుడు ఇరుముడి సినిమా కోసమే ఇలా సన్నబడ్డాడా? లేదా ఇంకేదైనా కారణం ఉందా అని సందేహిస్తున్నారు ఫ్యాన్స్, నెటిజన్లు.

అయ్యప్ప భక్తుడిగా రవితేజ!

రవితేజ సన్నబడినా ఈ లుక్ బాగుందంటున్నారు. ఒకవేళ ఇరుముడి సినిమా కోసమే అయితే ఆ సినిమాలో రవితేజని కొత్త మేకోవర్ లో చూడొచ్చని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. ప్రస్తుతం ఇరుముడి సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమాలో రవితేజ అయ్యప్పమాలలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాని కార్తీక మాసంలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

రవితేజ కొత్త లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ‘ఇరుముడి’ సినిమాతో రవితేజ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.