
📌 Key Points
- రవితేజ, డింపుల్ హయతి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి ‘అద్దం ముందు నిలబడి’ రెండో సింగిల్ రిలీజ్.
- చంద్రబోస్ రాసిన ఈ పాటను భీమ్స్ సీసిరోలియో స్వరపరిచగా, శ్రేయా ఘోషాల్, కపిల్ కపిలన్ ఆలపించారు.
- అదిరిపోయే లొకేషన్లు, చీరల్లో డింపుల్ హయతి అందాలతో నిండిన సూపర్ రొమాంటిక్ మెలోడీ ఇది.
- కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ఆశికా రంగనాథ్ కూడా కీలక పాత్ర పోషించారు.
రవితేజ, డింపుల్ హయతి నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం నుంచి సెకండ్ సింగిల్ విడుదలయ్యింది. ‘అద్దం ముందు నిలబడి’ అంటూ సాగే ఈ రొమాంటిక్ మెలోడీ అద్భుతమైన లొకేషన్లు, డింపుల్ అందాలతో ఆకట్టుకుంటోంది. ఈ పాట సినీ ప్రియులను ఎంతగానో అలరించనుంది.
రొమాంటిక్ మెలోడీ ‘అద్దం ముందు నిలబడి’ విశేషాలు
రవితేజ, డింపుల్ హయతి లీడ్ రోల్స్ లో నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. ఇదొక రొమాంటిక్ మెలోడీ. అదిరిపోయే లొకేషన్లు, చీరల్లో డింపుల్ అందాలతో ఈ పాట సాగిపోయింది.
మాస్ మహారాజ రవితేజ ఈసారి సంక్రాంతికి వస్తున్న విషయం తెలుసు కదా. చాలా రోజులుగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్న అతడు భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే వెరైటీ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. మూవీ టీమ్ ప్రమోషన్లు మొదలుపెట్టింది. ఈ మధ్యే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయగా.. బుధవారం (డిసెంబర్ 10) అద్దం ముందు నిలబడి అంటూ సాగే సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ ప్రమోషన్లు
ఈ పాటను చంద్రబోస్ రాయగా.. భీమ్స్ సీసిరోలియో మ్యూజిక్ అందించాడు. ఇక శ్రేయా ఘోషాల్, కపిల్ కపిలన్ పాడారు. శేఖర్ వీజే కొరియోగ్రఫీ చేశాడు. ఇదే మూవీ నుంచి ఈ మధ్యే బెల్లా బెల్లా అనే ఫస్ట్ సింగిల్ కూడా వచ్చిన విషయం తెలిసిందే.
భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ గురించి..
రవితేజ ఆశలు: సంక్రాంతికి రాబోయే చిత్రం
రవితేజతోపాటు ఆశికా రంగనాథ్, డింపుల్ హయతి లీడ్ రోల్స్ లో నటించిన మూవీ ఈ భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమాను కిశోర్ తిరుమల డైరెక్ట్ చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. ఇందులో ఇద్దరు భామల మధ్య నలిగిపోయే పాత్రలో రవితేజ కనిపిస్తున్నాడు. ఈ మధ్యే మాస్ జాతర రూపంలో అతనికి గట్టి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న మూవీ అతన్ని ఏమేర ఆదుకుంటుందో చూడాలి.
మొత్తానికి, ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ నుంచి విడుదలైన ఈ రొమాంటిక్ మెలోడీ సినిమాపై అంచనాలను పెంచుతోంది. రవితేజ ఈసారి విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. సంక్రాంతికి రాబోతున్న ఈ చిత్రం కోసం సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


