
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ కేసులో సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే నోటీసులు అందుకున్న ఆయనను అధికారులు పలు కోణాల్లో ప్రశ్నించారు. ఈ కేసులో మరికొంతమంది ప్రముఖులకు కూడా నోటీసులు అందాయి.
Key Points
విజయ్ దేవరకొండ బెట్టింగ్ యాప్స్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు.
బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో డీలింగ్, నగదు లావాదేవీలపై సిట్ ప్రశ్నించింది.
గతంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ ను విజయ్ దేవరకొండ ప్రమోట్ చేసినట్లు వెల్లడి.
రానా, మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్ వంటి ప్రముఖులకు కూడా నోటీసులు అందాయి.
విజయ్ దేవరకొండ సిట్ విచారణ: అసలేం జరిగింది?
Vijay Deverakonda: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే ఆయనకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. ఇందులో భాగంగానే విజయ్ ని కూడా(Vijay Deverakonda) విచారించింది సిట్. ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులను ఎలా కలిశారు, వాళ్ళతో డీలింగ్ ఎలా జరిగింది, డబ్బులు ఎలా తీసుకున్నారు, వాటిని ఏం చేశారు అనే కోణంలో అధికారులు విచారించినట్టుగా సమాచారం. ఈ కేసులో రానా, మంచు లక్ష్మీ, ప్రకాశ్ రాజ్ లాంటి వారికి కూడా నోటీసులు అందాయి. త్వరలోనే మరింత మందిని లిస్టు చేర్చి విచారించే అవకాశం ఉందని సమాచారం.
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, కేసు నేపథ్యం
Payal Rajput: శృంగారం తప్పు కాదు.. ఎందుకు సిగ్గుపడాలి.. బోల్డ్ బ్యూటీ బోల్డ్ కామెంట్స్..
విజయ్ దేవరకొండ భవిష్యత్ ప్రాజెక్టులు
ఇక విజయ్ దేవరకొండ గతంలో కొన్ని బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన విషయం తెలిసిందే. వాటిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీంతో విచారణకు హాజరయ్యాడు విజయ్ దేవరకొండ. ఇక సినిమాల విషయానికి వస్తే, ఇటీవలే కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఆయన రౌడీ జనార్ధన సినిమా సినిమా చేస్తన్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను దర్శకుడు రవికిరణ్ కోలా తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశము ఉంది.
బెట్టింగ్ యాప్స్ కేసు విచారణ కొనసాగుతోంది. విజయ్ దేవరకొండకు సంబంధించిన డీలింగ్స్, నగదు లావాదేవీలపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.


