
📌 Key Points
- రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా నుంచి ‘వామ్మో వాయ్యో’ ఫుల్ సాంగ్ రిలీజ్ చేయబడింది.
- పాటలో రవితేజ ఎనర్జీ, ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్‌తో పాటు అద్భుతమైన డాన్స్ హైలైట్‌గా నిలిచాయి.
- ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- ధమాకా తర్వాత రవితేజ పెద్ద సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు, ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
రవితేజ హీరోగా నటిస్తున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రం నుంచి ‘వామ్మో వాయ్యో’ ఫుల్ సాంగ్ విడుదలైంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ ఎనర్జీ, హీరోయిన్ల గ్లామర్‌తో ఈ పాట ఆకట్టుకుంటుంది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
‘వామ్మో వాయ్యో’ పాట హైలైట్స్
Vaammo Vaayyo song: రవితేజ (Raviteja) హీరోగా నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి (Bhartha Mahasayulaku Wignyapthi)సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సినిమా నుంచి వరుస అప్డేట్స్ తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి “వామ్మో వాయ్యో”(Vaammo Vaayyo song) అంటూ సాగిపోయే పాటను విడుదల చేశారు.రవితేజ ఎప్పటిలాగే తన ఎనర్జీ, స్వాగ్‌తో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ఇక ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి గ్లామర్‌తో పాటు అద్భుతమైన డాన్స్ తో ఉర్రూతలూగించారు.
సంక్రాంతి పండుగకు సరిగ్గా సరిపోయే మాస్ సాంగ్ అని తెలుస్తుంది. దేవ్ పవార్ ఈ పాటకు లిరిక్స్ అందించగా సింగర్ స్వాతి రెడ్డి ఈ పాటను ఆలపించారు. ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరు హీరోయిన్ల నడుమ రవితేజ అద్భుతమైన పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకున్న జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.
సంక్రాంతి బరిలో రవితేజ
ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మక చెరుకూరి సుధాకర్ నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని ఇప్పటికే విడుదల చేసిన ప్రమోషన్లను చూస్తేనే స్పష్టం అవుతుంది. ఇటీవల కాలంలో రవితేజ విభిన్నమైన కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఏ ఒక్క సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈయన చివరిగా ధమాకా సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా అనంతరం అరడజనుకు పైగా సినిమాలు వచ్చినా ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇటీవల విడుదలైన మాస్ జాతర సినిమాపై భారీగా అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరిచింది. మరి సంక్రాంతి బరిలో ప్రభాస్ చిరంజీవి వంటి స్టార్ హీరోలకు పోటీగా రవితేజ కూడా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సినిమా ద్వారా అయిన సక్సెస్ అందుకుంటారా? లేదా మరోసారి ప్రేక్షకులను నిరాశ పరుస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు ఇరుముడి అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో పాటు ఈయన తదుపరి కథలను వినే పనిలో ఉన్నారు.
సినిమాపై అంచనాలు, రవితేజ కెరీర్
సంక్రాంతి రేసులో స్టార్ హీరోలకు పోటీగా వస్తున్న రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాతో ఈసారి సక్సెస్ అందుకుంటారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. ‘వామ్మో వాయ్యో’ పాటతో ప్రేక్షకులలో అంచనాలు మరింత పెరిగాయి.


