|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

కుటుంబాన్ని బలితీసుకున్న రియల్టర్ ఆత్మహత్య: అసలేం జరిగింది?

Published: 01-07-2026, 2:20 AM
కుటుంబాన్ని బలితీసుకున్న రియల్టర్ ఆత్మహత్య: అసలేం జరిగింది?
  • తమిళనాడు ధర్మపురిలో రియల్టర్ సంతోష్ దారుణం.
  • భార్య శరణ్య, కూతురు సాత్వికను హత్య చేసి ఆత్మహత్య.
  • వ్యాపార నష్టాలు కారణమని పోలీసులు అనుమానం.
  • పోస్టుమార్టం, దర్యాప్తు కొనసాగుతోంది.

తమిళనాడులో జరిగిన ఒక దారుణ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ధర్మపురి జిల్లాలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన భార్య, కూతురిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఘటన వివరాలు: భార్య, కూతురు హత్య

తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి భార్య, కూతురును హత్య చేసి ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాష్ట్రంలోని ధర్మపురి జిల్లా కోట్టైకోలివ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. డీఎంకే నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్ (45) తన భార్య శరణ్య(36), కూతురు సాత్విక(14) తో కలిసి కోట్టైకోలివ్‌లో నివాసం ఉంటున్నాడు. సంతోష్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా భర్య గృహిణి, కుమార్తె 9వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న‌ట్టు తెలుస్తోంది. మంగ‌ళ‌వారం బాలిక పాఠ‌శాల‌కు వెళ్లగా సంతోష్ స్కూల్ నుండి ఇంటికి తీసుకువ‌చ్చాడు. అనంత‌రం భార్య‌ను గొంతునులిమి హ‌త్య చేయ‌గా కుమార్తెను సుత్తితో త‌ల‌పై కొట్టి హ‌త్య చేశాడు.

త‌ర‌వాత అక్క‌డ నుండి బైక్ తీసుకుని బ‌య‌ట‌కు వెళ్లాడు. ఘ‌ట‌న‌పై స్థానికులు స‌మాచారం ఇవ్వ‌డంతో పోలీసులు రంగంలోకి దిగి విచార‌ణ మొద‌లుపెట్టారు. పోలీసులు మృత‌దేహాల‌ను పోస్టుమార్టానికి త‌ర‌లించ‌గా అంత‌లోపే సేలం ధ‌ర్మ‌పురి హైవేలో ఓ వ్య‌క్తి లారీ కింద‌ప‌డి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్టు పోలీసుల‌కు స‌మాచారం అందింది. పోలీసులు ఘ‌ట‌నాస్థలానికి వెళ్లి చ‌నిపోయింది సంతోష్ అని నిర్దారించారు. వ్యాపారంలో న‌ష్టాలు రావ‌డం వ‌ల్ల సంతోష్ భార్య‌, కుమార్తెను హ‌త‌మార్చి త‌ను ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా లేదంటే మ‌రేదైనా కార‌ణం ఉందా అని పోలీసులు విచారిస్తున్నారు.

రియల్టర్ సంతోష్ ఆత్మహత్య

వ్యాపార నష్టాలే కారణమా? దర్యాప్తు

ఈ దారుణ ఘటన వెనుక వ్యాపార నష్టాలు ఉన్నాయా లేదా మరేదైనా కారణం ఉందా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.