|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Renu Desai: హాస్పిటల్ బెడ్‌పై ఉన్న రేణు దేశాయ్.. ఇది మొదటిసారి అంటూ షాకింగ్ పోస్ట్..

Published: 18-10-2025, 10:46 PM
Renu Desai: హాస్పిటల్ బెడ్‌పై ఉన్న రేణు దేశాయ్.. ఇది మొదటిసారి అంటూ షాకింగ్ పోస్ట్..

నటి రేణు దేశాయ్ హాస్పిటల్ బెడ్‌పై ఉన్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అభిమానులను షాక్‌కు గురి చేసింది. జంతు సేవలో భాగంగా రేబీస్ వ్యాక్సిన్ తీసుకుంటూ ఈ వీడియోను రికార్డ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. ఇది మొదటిసారి అంటూ అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో పోస్ట్ చేసినట్లు పేర్కొంది.

Key Points

1

రేణు దేశాయ్ ఆసుపత్రి బెడ్‌పై కనిపించి అభిమానులను ఆందోళనకు గురిచేసింది.

2

జంతు సేవలో భాగంగా రేబీస్ టెటానస్ టీకా తీసుకున్నట్లు వెల్లడించింది.

4

పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా, జంతు సంరక్షకురాలిగా రేణు దేశాయ్ ప్రసిద్ధి.

రేణు దేశాయ్ ఆరోగ్యంపై ఆందోళన

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) గత కొద్ది కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. చివరగా.. ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao)సినిమాలో నటించి మెప్పించింది. కానీ ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో గుడ్ బై చెప్పేసింది. ఇక అప్పటి నుంచి జంతు సంరక్షణ, వీధి కుక్కల సంక్షేమం పట్ల ఎంతో శ్రద్ధ వహిస్తోంది. అంతేకాకుండా తన కూతురు ఆద్య పేరుతో ఓ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేసింది. అప్పటినుంచి జంతువులకు ఎంతో సాయం చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది. కొన్నిసార్లు నెటిజన్లను విరాళాలు కూడా అడుగుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో ఆమె హాస్పిటల్‌ బెడ్‌పై కనిపించడంతో సడెన్‌గా చూసిన వారంతా షాక్ అవుతూ.. అయ్యో ఏమైంది మ్యాడమ్ అంటూ ఆందోళన చెందుతున్నారు. మరికొందరు షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందంటే.. మూగజీవాలకు సాయం చేస్తున్న సమయంలో రేణు దేశాయ్‌ను గీరడం, కొరకడం వంటివి చేస్తుండటంతో.. ఆమె రేబీస్ టీకాను తీసుకుంది. ఇందుకోసం హాస్పిటల్‌కు వెళ్లిన ఆమె వీడియో రికార్డ్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేసింది.

రేణు దేశాయ్ హాస్పిటల్ వీడియో వెనుక అసలు కారణం

ఇందులో ఏముందంటే.. ‘‘రేబీస్ టెటానస్ వ్యాక్సిన్ తీసుకునేటప్పుడు ఎన్నడూ ఫొటోలు, వీడియోలు తీయలేదు. అసలు ఆ ఆలోచన కూడా రాలేదు. కానీ అందరికీ అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈసారి టీకా తీసుకున్నప్పుడు ఇలా వీడియో రికార్డు చేశాను. ఇలా చేయడం మొదటిసారి. చురుగ్గా రెస్క్యూ పనిలో ఉన్న వ్యక్తులు, పశువైద్యులు తమ టీకా రికార్డులను ఉంచుకోవాలి. వారు సమయానికి ఇంజెక్షన్లు తీసుకుంటున్నారని నిర్ధారించుకోవాలి’’ అనే క్యాప్షన్ జత చేసింది. దీంతో అంతా కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. అలాగే జాగ్రత్తగా ఉండాలని సలహాలు ఇస్తున్నారు.

జంతు సంరక్షణపై రేణు దేశాయ్ అవగాహన

A post shared by renu desai (@renuudesai)

రేణు దేశాయ్ తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటూనే జంతువుల సంరక్షణ కోసం అందిస్తున్న సేవలు ప్రశంసనీయం. ఆమె చర్య ఇతరులకు స్ఫూర్తినిస్తూ, వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తుంది. అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.