|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?

Published: 08-12-2025, 9:54 AM
Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
  • రేణు దేశాయ్ ‘బద్రి’కి ముందే మోడల్‌గా కెరీర్ మొదలుపెట్టి చాలా ఆడిషన్స్ ఇచ్చింది.
  • ‘ప్రేమంటే ఇదేరా’ సినిమాలో వెంకటేష్‌తో కలిసి ఫోటోషూట్ కూడా చేశారట.
  • అయితే చివరి నిమిషంలో రేణు దేశాయ్‌ని ఈ ప్రాజెక్ట్ నుండి రిజెక్ట్ చేశారు.
  • ‘ప్రేమంటే ఇదేరా’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి, ఇప్పుడు వెంకటేష్ బర్త్‌డే సందర్భంగా రీ-రిలీజ్ అవుతోంది.

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కెరీర్ ప్రారంభంలో అనేక ఆడిషన్స్ ఇచ్చింది. ‘బద్రి’ కంటే ముందే ఓ తెలుగు స్టార్ హీరో సినిమా కోసం ఆమె ఫోటోషూట్ చేసి, ఆ తర్వాత రిజెక్ట్ చేయబడింది. ఆ సినిమా ఏంటి, అసలు అప్పుడు ఏం జరిగిందో తెలుసుకుందాం.

‘బద్రి’కి ముందు రేణు దేశాయ్ ఆడిషన్స్

రేణు దేశాయ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మాజీ భార్య అనే విషయం తెలిసిందే. పవన్‌ మొదటి భార్యకి విడాకులు ఇచ్చి ఆ తర్వాత రేణు డేశాయ్‌ని రెండో పెళ్లి చేసుకున్నారు. పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన `బద్రి` సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది రేణు. ఈ మూవీతోనే ఇద్దరు ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 13ఏళ్ల క్రితమే వీరిద్దరు విడిపోయారు. అయితే తరచూ రేణు దేశాయ్‌ వార్తల్లో నిలుస్తోంది. ఆ మధ్య తన కెరీర్‌ గురించి ఓ సంచలన విషయాన్ని వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉంటే రేణు దేశాయ్‌ `బద్రి` సినిమాకి ముందు మోడల్‌గా చేసింది.  ఆ సమయంలోనే చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చింది రేణు దేశాయ్‌. అలా ఓ టాలీవుడ్‌ స్టార్‌ హీరో సినిమాకి కూడా ఆడిషన్‌ ఇచ్చిందట. ఏకంగా హీరోతో ఫోటో షూట్‌ కూడా చేశారట. కానీ చివరి నిమిషంలో ఆ సినిమాని నుంచి రిజెక్ట్ చేశారు. అలా రేణు బ్లాక్‌ బస్టర్‌ మూవీని కోల్పోయింది. మరి ఆ సినిమా ఏంటి? ఆకథేంటో చూస్తే.

వెంకటేష్‌తో ఫోటోషూట్, రిజక్షన్ కారణం

రేణు దేశాయ్‌ మోడల్‌గా ఉన్న సమయంలో చాలా ఆడిషన్స్ ఇచ్చింది రేణు దేశాయ్‌. అలా తెలుగులో `ప్రేమంటే ఇదేరా` మూవీకి కూడా ఆడిషన్‌ ఇచ్చిందట. ఈ సినిమాకి ఐశ్వర్యా రాయ్‌ని అనుకున్నారట. కానీ ఆమె చేయలేదు. ఆ తర్వాత అమిషా పటేల్‌ని అనుకున్నారట. ఆమెతోపాటు రేణు దేశాయ్‌, భూమిక, రీమా సేన్‌ వంటి హీరోయిన్లని ఆడిషన్‌ చేశారట. వెంకటేష్‌తో కలిసి ఫోటో షూట్‌ కూడా చేశారట. కానీ ఎవరూ సెట్‌ కాలేదని, చివరికి ప్రీతి జింటాని ఎంపిక చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు జయంత్‌ సీ పరాన్జీ రాజేష్‌ మన్నే యూట్యూబ్‌ ఛానెల్‌లో వెల్లడించారు.

అలా రేణు దేశాయ్‌.. వెంకటేష్‌ హీరోగా నటించిన `ప్రేమంటే ఇదేరా` చిత్రం నుంచి రిజెక్షన్‌ చేశారు. ఈ మూవీకి జయంత్‌ సీ పరాన్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 1998 అక్టోబర్‌ 30న విడుదలైంది. ఈ సినిమా లవ్‌ స్టోరీస్‌లో అప్పట్లో ఓ ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అటు యూత్‌ని, ఇటు ఫ్యామిలీని ఆకట్టుకుంది. బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ ఏడాది అత్యధిక వసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఓ రకంగా అది ఇండస్ట్రీ హిట్‌ అని చెప్పొచ్చు.

‘ప్రేమంటే ఇదేరా’ – ఓ బ్లాక్‌బస్టర్ హిస్టరీ

తాజాగా ఈ మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. ఈ నెల 13న వెంకటేష్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా `ప్రేమంటే ఇదేరా` మూవీని రీ రిలీజ్‌ చేస్తున్నారు. దీంతో అప్పుడు సంచలనం సృష్టించిన ఈ మూవీ ఇప్పుడు ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. వెంకీ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన `కలిసుందాం రా` మూవీని కూడా రీ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. ఇక ప్రస్తుతం వెంకటేష్‌.. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్నారు. దీంతోపాటు చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి రూపొందిస్తున్న `మన శంకరవరప్రసాద్‌ గారు` మూవీలో గెస్ట్ గా కనిపించబోతున్నారు.

ఇదిలా ఉంటే రేణు దేశాయ్‌ పవన్‌తో `బద్రి`, `జానీ` చిత్రాలు చేసింది. ఆ తర్వాత నటనకు దూరమయ్యింది. ఆ మధ్య రవితేజతో `టైగర్‌ నాగేశ్వరరావు` చిత్రంలో మెరిసింది. చాలా ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కూడా మళ్లీ గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ మరో సినిమాలో నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రం స్టార్ట్ అయ్యింది. ఇందులో అనసూయ కూడా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం.

వెంకటేష్ నటించిన ‘ప్రేమంటే ఇదేరా’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్ బ్లాక్‌బస్టర్. రేణు దేశాయ్ మిస్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు వెంకీ పుట్టినరోజు సందర్భంగా రీ-రిలీజ్ అవుతూ మరోసారి వార్తల్లో నిలుస్తోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.