
సోషల్ మీడియాలో విశ్వక్ సేన్, నిహారికల పాత వీడియో క్లిప్ ఒకటి వైరల్ అవుతోంది. ఇది 11 ఏళ్ల క్రితం ‘టర్మ్స్ అండ్ కండిషన్స్’ పాటలోనిది. అప్పట్లో విశ్వక్ సేన్ దినేష్ నాయుడుగా పలు షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. ఆయన మార్పును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్లిప్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Key Points
వైరల్ క్లిప్‌లో విశ్వక్ సేన్ (దినేష్ నాయుడు), నిహారిక ఉన్నారు.
ఇది 11 ఏళ్ల క్రితం 'టర్మ్స్ అండ్ కండిషన్స్' పాటలోని దృశ్యం.
విశ్వక్ సేన్ మార్పును చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
నిహారిక నిర్మాతగా, విశ్వక్ సేన్ 'ఫంకీ' సినిమాతో బిజీగా ఉన్నారు.
వైరల్ క్లిప్‌లో ఉన్న ఆ ఇద్దరు ఎవరు?
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. రీసెంట్ టైంలో రిలీజైన పాటలతో పాటు గతంలో రిలీజైన సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ హల్‌చల్ చేస్తుంటాయి. అలా ఇప్పుడు ఓ క్లిప్ వైరల్ అయిపోతోంది. వీళ్లు ఆ హీరోహీరోయిన్ కదా అని తెలిసి ఆశ్చర్యపోవడం నెటిజన్ల వంతయింది. మరి మీరేమైనా వీళ్లని గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
విశ్వక్-నిహారికల పాత వీడియో: అసలు కథేంటి?
పైన ఫొటోలో కనిపిస్తున్న ఇద్దరిలో ఒకరు నిహారిక కాగా మరొకరు దినేశ్ నాయుడు. దినేశ్ ఎవరబ్బా అని మీరు ఆలోచిస్తున్నారు కదా! ప్రస్తుతం తెలుగులో హీరోగా సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్ అసలు పేరు దినేశ్ నాయుడు. అప్పట్లో అంటే 11-12 ఏళ్ల క్రితం పలు షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్ సాంగ్స్ చేశాడు. వాటన్నింటిలోనూ దినేశ్ అనే పేరు కనిపిస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు ఓ క్లిప్ వైరల్ అవుతోంది. ఇది పదకొండేళ్ల క్రితం వచ్చిన ‘టర్మ్స్ అండ్ కండీషన్స్’ పాటలోనిది.
ప్రస్తుతం విశ్వక్, నిహారిక ఏం చేస్తున్నారు?
అప్పట్లో నిహారిక కూడా పలు షార్ట్ ఫిల్మ్స్ చేసేది. అలా ఈ పాట కోసం విశ్వక్ సేన్‌తో నటించింది. అప్పటి సాంగ్ క్లిప్ ఇప్పుడు వైరల్ అయ్యేసరికి విశ్వక్ సేన్ ఇంతలా మారిపోయాడా అని నెటిజన్లు సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ఫంకీ’ సినిమా చేస్తుండగా.. నిహారిక యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసి నిర్మాతగా మారిపోయింది. గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీతో హిట్ కొట్టింది. ఇప్పుడు కూడా ఓ ప్రాజెక్ట్ చేస్తోంది. ఏదేమైనా వైరల్ క్లిప్ వల్ల విశ్వక్-నిహారిక జంట సోషల్ మీడియాలో టాపిక్ అయిపోయారు.
మొత్తానికి 11 ఏళ్ల నాటి ఈ వైరల్ క్లిప్ విశ్వక్ సేన్, నిహారికల గురించి సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. వారి కెరీర్‌లో వచ్చిన మార్పులను ఈ క్లిప్ మరోసారి గుర్తుచేసింది. పాత జ్ఞాపకాలను నెటిజన్లు సరదాగా నెమరువేసుకుంటున్నారు.


