|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Renuka Swamy: రేణుక స్వామి సమాధి ద్వంసం.. చిక్కుల్లో పడిన దర్శన్?

Published: 10-12-2025, 6:08 AM
Renuka Swamy: రేణుక స్వామి సమాధి ద్వంసం.. చిక్కుల్లో పడిన దర్శన్?
  • కన్నడ నటుడు దర్శన్ రేణుక స్వామి హత్య కేసులో జైలులో ఉన్నారు.
  • కోర్టు బెయిల్ మంజూరు చేయక పోవడంతో దర్శన్ తరపు న్యాయవాదులు ఇబ్బందులు పడుతున్నారు.
  • దర్శన్ అభిమాని చిత్రదుర్గలో రేణుక స్వామి సమాధిని బద్దలు కొట్టాడు.
  • ఈ ఘటనతో దర్శన్ కు బెయిల్ లభించడం మరింత ఆలస్యం కావచ్చని అంచనా.

కన్నడ నటుడు దర్శన్ రేణుక స్వామి హత్య కేసులో జైలులో ఉండగా, బెయిల్ తిరస్కరణతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శన్ అభిమాని రేణుక స్వామి సమాధిని ధ్వంసం చేయడంతో ఆయన మరింత చిక్కుల్లో పడ్డారు. ఈ ఘటన దర్శన్ బెయిల్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

దర్శన్ జైలు జీవితం, బెయిల్ తిరస్కరణ

Renuka Swamy: కన్నడ సినీ నటుడు దర్శన్ (Darshan)ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కన్నడ చిత్ర పరిశ్రమలో నటుడుగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన మరొక నటి రేణుక స్వామి(Renuka Swamy) హత్య కేసులో భాగంగా జైలు పాలయ్యారు. ఇలా దర్శన్ జైలుకు వెళ్లడంతో ఆయన అభిమానులు ఈ విషయంలో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దర్శన్ ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నారని తనకు బెయిల్ కావాలి అంటూ తరచు కోర్టును ఆశ్రయించిన కోర్టు మాత్రం ఈయనకు బెయిల్ మంజూరు చేయటానికి నిరాకరణ తెలుపుతుంది. జైలులో దర్శన్ కు కనీస సౌకర్యాలు కూడా లేవని ఆయన తరపు లాయర్లు కోర్టును ఆశ్రయిస్తున్నారు.

దర్శన్ కు జైలులో కనీసం సౌకర్యాలు అయినా కల్పించాలని ఆయన తరపు లాయర్లు పిటిషన్ వేసిన కోర్టు మాత్రం ధిక్కరిస్తోంది. ఈ నేపథ్యంలోనే జైలులో ఉండలేక దర్శన్ తనను చంపేయమంటూ కోర్టును కోరిన సంగతి తెలిసిందే. ఇలా ఈ హత్య కేసులో భాగంగా దర్శన్ జైలు జీవితం అనుభవిస్తున్న నేపథ్యంలో బయట ఉన్న ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా దర్శన్ అభిమాని ఏకంగా నటి రేణుక స్వామి సమాధిని బద్దలు కొట్టారు. చిత్రదుర్గలో నివసిస్తున్నటువంటి దర్శన్ అభిమాని ఈ పనికి పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రేణుక స్వామి సమాధికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అభిమాని ఆగ్రహం: సమాధి ద్వంసం

ఈ విధంగా రేణుక స్వామి సమాధిని పగలగొట్టిన నేపథ్యంలో దర్శన్ కూడా మరింత చిక్కుల్లో పడ్డారని తెలుస్తోంది.. ఇప్పటికే కనీసం బెయిల్ రాక ఎన్నో ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఆయన అభిమానులు ఇలాంటి దారుణానికి పాల్పడిన నేపథ్యంలో ఇప్పుడప్పుడే బెయిల్ కూడా వచ్చే అవకాశాలు లేవని పలువురు ఈ వార్తలపై స్పందిస్తున్నారు. ఇక గతంలో దర్శన్ ను తప్పు పడుతూ కొంతమంది సెలబ్రిటీలు మాట్లాడిన విషయం తెలిసిందే.

విడుదలకు సిద్ధమైన దర్శన్ డెవిల్..

బెయిల్ మరింత కష్టం: పరిణామాలు

దర్శన్ చేసిన పనిని తప్పని చెప్పిన నేపథ్యంలోనే పలువురు సెలబ్రిటీలకు దర్శన్ అభిమానుల నుంచి ఏకంగా అత్యాచార బెదిరింపులు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా రోజు రోజుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి రేణుక స్వామి సమాధిని పగలగొట్టడం పట్ల పోలీసులు ఏ విధంగా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ వివాదం కారణంగా నటుడు దర్శన్ జైలు పాలు అవ్వడమే కాకుండా పూర్తిగా తన కెరియర్ కోల్పోయారని చెప్పాలి. ఇక ఈయన చివరిగా నటించిన డెవిల్ (Devil)అనే సినిమా డిసెంబర్ 11వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.

రేణుక స్వామి సమాధి ధ్వంసం ఘటన దర్శన్ ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టింది. బెయిల్ రావడం కష్టంగా మారడమే కాకుండా, పోలీసుల తదుపరి చర్యలు, ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.