|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్రమ మైనింగ్‌పై రేవంత్ రెడ్డి సర్కార్ సీబీసీఐడీ విచారణ! అసెంబ్లీలో సంచలన ప్రకటన!

Published: 28-03-2026, 8:05 AM
అక్రమ మైనింగ్‌పై రేవంత్ రెడ్డి సర్కార్ సీబీసీఐడీ విచారణ! అసెంబ్లీలో సంచలన ప్రకటన!
  • రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్.
  • అక్రమాలపై మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
  • రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు అన్ని ఆరోపణలు ఉన్న కంపెనీలపై విచారణకు సీఎం ఆదేశం.
  • వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదికను ప్రవేశపెడతామని రేవంత్ రెడ్డి ప్రకటన.

తెలంగాణ అసెంబ్లీలో అక్రమ మైనింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సీబీసీఐడీ విచారణకు ఆదేశించారు.

రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై హరీష్ రావు ప్రశ్నలు

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే హరీశ్ రావ్ మాట్లాడుతూ… విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు.కాంగ్రెస్ సర్కార్‌కు ధైర్యం ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి లేదా హౌస్ కమిటీ వేయాలని సవాల్ విసిరారు.

ఎలాంటి పర్మిషన్లు, లైసెన్సులు లేకుండా డీజిల్ జనరేటర్లతో దర్జాగా స్టోన్ క్రషర్ దందా చేస్తున్నారని హరీశ్ రావ్ ఆరోపించారు. అధికారులు రెండుసార్లు పట్టుకున్నా, నోటీసులు ఇచ్చినా రాఘవ కన్స్ట్రక్షన్స్‌పై యాక్షన్ ఏదీ…? అని ప్రశ్నించారు.

“నిబంధనల ప్రకారం 25 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష ఎందుకు వేయలేదు..? బీఆర్ఎస్ ఎమ్మెల్యే తమ్ముడికి రాత్రికి రాత్రే జైలు.. అధికార పార్టీ మంత్రికి మాత్రం అండదండలా..?రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తక్షణమే నైతికంగా రాజీనామా చేయాలి” అని హరీశ్ రావ్ డిమాండ్ చేశారు.

సీబీసీఐడీ విచారణకు రేవంత్ రెడ్డి ప్రకటన

“రాఘవ పేరు స్వయాన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరు.. ఆ కంపెనీ ఆయనదేనని లోకమంతా తెలుసు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డే. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుంది. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలు చెబుతుంది. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి” అని హరీష్ రావ్ డిమాండ్ చేశారు.

ఈ విషయాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. సీబీసీఐడీ విచారణకు సిద్ధమనిఅసెంబ్లీలో ప్రకటించారు. రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటుగా ఆరోపణలు ఉన్న అన్ని కంపెనీలపైనా విచారణ జరిపిస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదిక ప్రవేశపెడతామని ప్రకటించారు.

సిరిసిల్ల ఇసుక మాఫియాపై సంతోష్ రావు, తండ్రి రవీందర్ రావు పై విచారణకు కూడా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గంగుల కమలాకర్ సంబంధించి ఇల్లీగల్ గ్రానైట్ మైనింగ్ పై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీ అక్రమ మైనింగ్ పై విచారణకు సిద్ధమని… అదే సమయంలో రాఘవ కన్స్ట్రక్షన్ తో ఆరోపణలు ఉన్న అన్నింటిపై సీబీసీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని ప్రకటించారు. విచారణలో నిజాలు నిగ్గు తేలుస్తామని వ్యాఖ్యానించారు.

ఇతర కంపెనీలపై కూడా విచారణ

“ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే ఎలాంటి తప్పిదాలు జరిగినా మా ప్రభుత్వం ఉపేక్షించదు. అందులో భాగంగానే రాఘవ కన్స్ట్రక్షన్స్ కు నోటీసులు ఇచ్చింది.. చర్యలు తీసుకోమంది. రాఘవ కన్స్ట్రక్షన్ నుంచి మైనింగ్ శాఖ ఫైన్ కట్టించుకుంది. ఇది వాళ్లు కనిపెట్టి పిర్యాదు చేస్తే తీసుకున్న చర్యలు కాదు. మా ప్రభుత్వమే వివరాలు తీసుకుని చర్యలు తీసుకుంది. మంత్రిపై బురద చల్లాలని, వాళ్ల పైరవీలకు సహకరించడం లేదని బ్లాక్ మెయిల్ చేయాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ల బ్లాక్ మెయిల్ లకు ప్రభుత్వం లొంగదు. సీబీసీఐడీ విచారణతో నిజాలు నిగ్గు తెలుస్తాం”అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 – 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన ‘లాంగ్వేజేస్ జర్నో’ అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు. Read More

సీబీసీఐడీ విచారణతో అక్రమ మైనింగ్ వ్యవహారాల్లో నిజాలు వెలుగులోకి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.