
📌 Key Points
- రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు: సెన్సార్ బోర్డు అవసరమా?
- 9 ఏళ్ల పిల్లలు పోర్న్ చూస్తున్న ఈ రోజుల్లో సెన్సార్ ఎందుకని ప్రశ్న!
- విజయ్ జననాయగన్ సినిమాపై సెన్సార్ అభ్యంతరాలపై వర్మ రియాక్షన్
- సినిమా అనేది అద్దం.. పాఠాలు నేర్పే క్లాస్ రూమ్ కాదని వర్మ కామెంట్
రామ్ గోపాల్ వర్మ మరోసారి తన సంచలన కామెంట్స్తో వార్తల్లో నిలిచారు. సెన్సార్ బోర్డు అవసరం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
సెన్సార్ బోర్డుపై రామ్ గోపాల్ వర్మ ఫైర్
రామ్ గోపాల్ వర్మ మరోసారి సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. అసలు సెన్సార్ బోర్డు అవసరమా అని ప్రశ్నించాడు. 9 ఏళ్ల పిల్లాడు కూడా పోర్న్ చూస్తున్న ఈ రోజుల్లో సినిమాల్లో నుంచి వాటిని తొలగించాలనడం ఏంటని ప్రశ్నించాడు.
డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సెన్సార్ బోర్డుపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా విజయ్ జన నాయగన్ తోపాటు పలు సినిమాలకు బోర్డు నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో అతడు స్పందించాడు. ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ సుదీర్ఘమైన పోస్ట్ చేసిన వర్మ.. అసలు ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు అవసరమా అని ప్రశ్నించాడు.
సెన్సార్ బోర్డుపై వర్మ ఏమన్నాడంటే?
విజయ్ సినిమా వివాదం.. అసలు కారణం ఏంటి?
“ఇది కేవలం దళపతి విజయ్ నటిస్తున్న ‘జననాయగన్’ సినిమాకు సంబంధించిన సెన్సార్ సమస్య మాత్రమే కాదు. మొత్తం వ్యవస్థకు సంబంధించిన మౌలికమైన ప్రశ్న. అసలు ఈ రోజుల్లో సెన్సార్ బోర్డు ఇంకా అవసరమా? అరచేతిలో అరాచకం ఉన్నప్పుడు.. సినిమాలో కత్తెర్లు ఎందుకు? మనం ఎటువంటి కాలంలో బతుకుతున్నాం? ఒక 9 ఏళ్ల పిల్లాడికి హార్డ్-కోర్ పోర్న్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఖాళీగా ఉన్న వృద్ధులు విద్వేషపూరిత ప్రచారాలను, కుట్ర సిద్ధాంతాలను నమ్ముతున్నారు. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా, ఎలాంటి కటింగ్ లేకుండా, సెన్సార్ లేకుండా అల్గారిథమ్స్ ద్వారా ఈ సమాచారం జనంలోకి వెళ్తోంది. ఇవన్నీ ఆపడానికి అక్కడ ఏ గేట్కీపర్ లేరు” అని వర్మ అన్నాడు.
వాళ్లూ బూతులేగా మాట్లాడుతున్నారు
ఓటు వేయడానికి ఉన్న తెలివి.. సినిమా చూడటానికి లేదా?
సినిమా అద్దం.. పాఠాలు కాదు: వర్మ
నైతిక బాధ్యత పేరుతో నాటకాలు
జనం ఎప్పటికీ చిన్నపిల్లలే అని, వాళ్లకు ఏం చూపించాలో తామే నిర్ణయిస్తామని సెన్సార్ బోర్డు భావిస్తోందని వర్మ అన్నాడు. సినిమా అనేది పాఠాలు నేర్పే క్లాస్ రూమ్ కాదని, అదొక అద్దమని చెప్పాడు. వయసుల వారీగా సినిమాలను వర్గీకరించడం సరైన పద్ధతి అని.. హెచ్చరికలు జారీ చేయడం సరైన పద్ధతి అని.. సెన్సార్షిప్ మాత్రం కాదని వర్మ తేల్చి చెప్పాడు.
రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ త్వరలో అందిస్తాం.



Shraddha Srinath’s Epic Clapbacks Silence Trolls Over Outfit & Marriage Comments