|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సినిమా తారల సంపాదనపై ఓ లుక్కేయండి! ధనవంతుల జాబితాలో మీ అభిమాన నటి ఎక్కడో తెలుసా?

Published: 10-03-2026, 3:35 AM
సినిమా తారల సంపాదనపై ఓ లుక్కేయండి! ధనవంతుల జాబితాలో మీ అభిమాన నటి ఎక్కడో తెలుసా?
  • ఐశ్వర్య రాయ్ బచ్చన్ రూ.800 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు.
  • ప్రియాంక చోప్రా రూ.600 కోట్ల సంపాదనతో రెండవ స్థానంలో నిలిచారు.
  • ఆలియా భట్, దీపికా పదుకొనె, కరీనా కపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
  • హీరోయిన్లు తమ ఆదాయాన్ని తెలివిగా పెట్టుబడులు పెట్టి పెంచుకుంటున్నారు.

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీనటుల సంపాదన గురించి చర్చ జరుగుతూ ఉంటుంది. బాలీవుడ్ లో అత్యధిక ధనవంతులైన టాప్ 10 హీరోయిన్ల జాబితా ఇప్పుడు వైరల్ అవుతోంది. వారి ఆస్తుల వివరాలు ఇప్పుడు చూద్దాం.

టాప్ 10 ధనవంతులైన హీరోయిన్లు

Richest Actresses: సాధారణంగా ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా లేదా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అయినా సరే అత్యధిక ధనవంతుల జాబితా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ముఖ్యంగా హీరోలకు సంబంధించిన ఈ లిస్ట్ అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా ఆలోచించారా హీరోయిన్స్ తమ సినిమాల ద్వారా ఎంత సంపాదిస్తున్నారు అని.. అయితే ఇప్పుడు తాజాగా ప్రత్యేకించి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సత్తా చాటుతూ.. అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న టాప్ 10 రిచెస్ట్ హీరోయిన్స్ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీ ఫేవరెట్ హీరోయిన్ ఆస్తి ఎంత? ఎవరు ఏ స్థానంలో ఉన్నారు? ఎవరు ఎంత ఆస్తి కూడబెట్టారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఇకపోతే సినిమాల ద్వారా అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటూ.. భారీ విజయాలను దక్కించుకుంటూ అందరిని ఆశ్చర్యపరిస్తున్నారు. ఇకపోతే సినిమాల ద్వారా వచ్చిన డబ్బును స్మార్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ.. తమ ఆదాయాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇక అలాంటి వారిలో ప్రధమంగా వినిపిస్తున్న పేరు ఐశ్వర్యరాయ్ బచ్చన్.. మాజీ విశ్వసుందరిగా పేరు దక్కించుకున్న ఈమె హీరోయిన్ మాత్రమే కాదు బాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ మాత్రమే కాదు రూ.800కోట్ల సంపాదనను కూడబెట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక ఆస్తులు కలిగిన హీరోయిన్గా మొదటి స్థానంలో నిలిచింది ఐశ్వర్యారాయ్ బచ్చన్.

హీరోయిన్ల ఆస్తుల వివరాలు

ఇకపోతే ఈ జాబితాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా రూ.600 కోట్ల సంపాదనతో రెండవ స్థానంలో నిలిచింది. ఒకవైపు బాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే.. మరొకవైపు హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాలో మందాకిని పాత్ర పోషిస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత స్థానాలలో ఆలియా భట్ రూ.550 కోట్లు, దీపికా పదుకొనె 500 కోట్లు, కరీనాకపూర్ ఖాన్ 485 కోట్లు, కత్రినా కైఫ్ 265 కోట్లతో తర్వాతి స్థానాలలో నిలిచారు.

సినిమాల ద్వారా ఆదాయం

మిగిలిన హీరోయిన్స్ ఆస్తుల వివరాల విషయానికి వస్తే.. అనుష్క శర్మ 255 కోట్లు , మాధురి దీక్షిత్ 250 కోట్లు, కాజోల్ 235 కోట్లు , రాణీ ముఖర్జీ 205 కోట్లు.. వీరంతా కూడా భారీగా ఆస్తులు కూడబెట్టారు . ముఖ్యంగా సినిమాల ద్వారా వచ్చిన డబ్బును స్మార్ట్ గా పలు రంగాలలో. ఇన్వెస్ట్మెంట్ చేస్తూ తమ ఆదాయాన్ని పెంపొందించుకున్నారు.

సినిమాల ద్వారా సంపాదించిన డబ్బును తెలివిగా పెట్టుబడులు పెట్టి తమ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. ఈ జాబితాలో మీ అభిమాన నటి స్థానం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంది కదూ!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.