|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ: పూజా కార్యక్రమం రేపే! షూటింగ్ ఎప్పుడో తెలుసా?

Published: 17-04-2026, 6:05 AM
సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ: పూజా కార్యక్రమం రేపే! షూటింగ్ ఎప్పుడో తెలుసా?
  • వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా.
  • ఏప్రిల్ 18న ముంబైలో పూజా కార్యక్రమం.
  • ఏప్రిల్ నుండి మే వరకు మొదటి షెడ్యూల్ షూటింగ్.
  • ఈ చిత్రంలో సల్మాన్ సరసన నయనతార నటిస్తోంది.

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఏప్రిల్ 18న ముంబైలో జరగనుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి మూవీ పూజా కార్యక్రమం ఎక్కడ?

Salman Khan Vamsi Paidipalli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎన్నో అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో దర్శకుడు వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli)ఒకరు . ఈయన తెలుగు హీరోలతో మాత్రమే కాకుండా ఇతర భాష హీరోలతో కూడా సినిమాలు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చివరిగా వారసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఈయన తదుపరి సినిమాని ప్రకటించకపోయిన సల్మాన్ ఖాన్ (Salman Khan)సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి.

ఈ వార్తలకు అనుగుణంగానే వంశీ పైడిపల్లి సల్మాన్ ఖాన్ సినిమాని అధికారకంగా ప్రకటించారు. ఈ చిత్రం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి స్వయంగా సల్మాన్ ఖాన్ అప్డేట్ ఇస్తూ ఏప్రిల్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలియజేశారు. ఇకపోతే తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ముహూర్తం కూడా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఏప్రిల్ 18వ తేదీ ముంబైలో ఎంతో ఘనంగా ప్రారంభం కాబోతున్నట్టు సమాచారం.

షూటింగ్ ఎప్పుడు ప్రారంభం?

ఇలా పలువురు సినీ సెలబ్రిటీల సమక్షంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ముంబైలోనీ SRPF గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో ఈ పూజా కార్యక్రమాలు జరగబోతున్నాయి అదేవిధంగా ఈ సినిమా పూజా కార్యక్రమం రోజున ఈ సినిమాకు సంబంధించి ఒక వింటేజ్ సాంగ్ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం. ఏప్రిల్ 18 నుంచి మే 4 వరకు ఒక షెడ్యూల్ చిత్రీకరణ ప్లాన్ చేశారని ఇందులో సాంగ్ షూటింగ్ తో పాటు ఒక యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ కూడా పూర్తికానున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని 2027 ఈద్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు తెలుస్తుంది.

సల్మాన్ ఖాన్ జోడిగా నయనతార..

సల్మాన్ సరసన నయనతార!

ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్ జోడిగా సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార జంటగా నటించబోతున్నారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నయనతార ఇదివరకే షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా తర్వాత నయనతార పాన్ ఇండియా ప్రాజెక్టుల ద్వారా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ తో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ తో పాటు తమిళ స్టార్ హీరో అరవిందస్వామి కూడా కీలక పాత్రలలో కనిపించబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు ఎక్కడ అధికారకంగా వెల్లడించలేదు.

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా 2027 ఈద్ సందర్భంగా విడుదల కానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.