|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రిషబ్ శెట్టి, హోంభలే ఫిలిమ్స్.. బంధం తెంచుకున్నారా? అసలు ఏం జరిగింది?

Published: 15-04-2026, 7:35 AM
రిషబ్ శెట్టి, హోంభలే ఫిలిమ్స్.. బంధం తెంచుకున్నారా? అసలు ఏం జరిగింది?
  • కాంతారా సినిమాతో రిషబ్ శెట్టికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు లభించింది.
  • హోంభలే ఫిలిమ్స్‌ను రిషబ్ శెట్టి అన్ ఫాలో చేయడంతో విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి.
  • రిషబ్ భార్య ప్రగతి శెట్టిని కో ప్రొడ్యూసర్‌గా తీసుకోవాలనే ప్రతిపాదన వివాదానికి కారణమని సమాచారం.
  • ప్రస్తుతం కాంతారా 3 పనులను రిషబ్ పక్కన పెట్టారని తెలుస్తోంది.

రిషబ్ శెట్టి, హోంభలే ఫిలిమ్స్ మధ్య విభేదాలు తలెత్తాయని వార్తలు వస్తున్నాయి. కాంతారా సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న రిషబ్, హోంభలే ఫిలిమ్స్‌ను అన్ ఫాలో చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రిషబ్ శెట్టి, హోంభలే ఫిలిమ్స్ మధ్య విభేదాలు?

Rishab shetty: రిషబ్ శెట్టి పరిచయం అవసరం లేని పేరు. కన్నడ దర్శకుడిగా ఈయన తన సినీ ప్రస్తానాన్ని మొదలుపెట్టారు. దర్శకుడుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న రిషబ్ అనంతరం కాంతార సినిమా ద్వారా నటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో ఈయన తదుపరి కాంతారా సిరీస్ నుంచి వరుస సినిమాలను ప్రకటించారు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతారా చాప్టర్ 1 సినిమా పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడంతో కాంతారా 3 కూడా ఉంటుందని ప్రకటించారు.

ఈ సినిమా స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాబోతోందని అభిమానులు భావిస్తున్న నేపథ్యంలో అభిమానులకు ఈ సినిమా విషయంలో ఊహించని షాక్ ఇచ్చారు. కాంతారా 3 ఉండదని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఇలా ఈ వార్తలు రావడానికి కారణం లేకపోలేదు. రిషబ్ (Rishab Shetty)తన ఇంస్టాగ్రా వేదికగా ఉన్న ఫాలోవర్స్ అందరినీ కూడా ఈయన అన్ ఫాలో చేయడంతో ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. చివరికి తనకు మంచి లైఫ్ ఇచ్చిన హోం భలే ఫిలిమ్స్ (Hombale Films)వారిని కూడా ఈయన అన్ ఫాలో చేయడం గమనార్హం.

విభేదాలకు కారణం ప్రగతి శెట్టినా?

ఇలా ఇంస్టాగ్రామ్ లో అందరిని అన్ ఫాలో చేయడంతో రిషబ్ శెట్టి అలాగే హోం బలే ఫిలిమ్స్ మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని అందుకే కాంతారా 3 కూడా ఈ నిర్మాణ సంస్థలో ఉండడం లేదంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇలా వీరిమధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏంటనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఇలా రిషబ్ హోంబలే ఫిలిమ్స్ మధ్య విభేదాలు రావడానికి ప్రధాన కారణం రిషబ్ భార్య ప్రగతి శెట్టి (Pragathi Shetty)అని తెలుస్తుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన కాంతారా చాప్టర్ వన్ సినిమా సుమారు 800 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. దీంతో తదుపరి రాబోయే కాంతారా 3 సినిమా కోసం ప్రగతి శెట్టిని కో ప్రొడ్యూసర్ గా చేర్చాలని ప్రతిపాదన వచ్చింది.

జై హనుమాన్ పనులలో బిజీగా రిషబ్..

కాంతారా 3 ఆగిపోనుందా?

ప్రగతి శెట్టిని క్రో ప్రొడ్యూసర్ గా చేర్చుకోవాలని ప్రతిపాదన కారణంగానే వీరి మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయని అందుకే రిషబ్ శెట్టి హోంభలే ఫిలిమ్స్ ను అన్ ఫాలో చేశారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి నిజంగానే ప్రగతి శెట్టి కారణంగా వీరిద్దరి మధ్య విభేదాలు చోటుచేసుకున్నాయా? లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా3 పనులను పక్కనపెట్టి జై హనుమాన్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హనుమాన్ సినిమాకు సీక్వెల్ చిత్రంగా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ పనులు ఇటీవల ప్రారంభం అయ్యాయి.

ప్రగతి శెట్టి కారణమయితే, రిషబ్, హోంభలే ఫిలిమ్స్ మధ్య సఖ్యత కుదురుతుందా లేదా అనేది వేచి చూడాలి. కాంతారా 3 విడుదలపై కూడా సందిగ్ధత నెలకొంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.