|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మిరాయ్ బ్యూటీ రితిక నాయక్ దశ తిరిగింది! ఏకంగా స్టార్ హీరోల సరసన.. 2026లో భారీ ప్రాజెక్టులతో.

Published: 29-12-2025, 12:28 AM
మిరాయ్ బ్యూటీ రితిక నాయక్ దశ తిరిగింది! ఏకంగా స్టార్ హీరోల సరసన.. 2026లో భారీ ప్రాజెక్టులతో.
  • మిరాయ్ సినిమాలో తన అద్భుత పాత్రతో రితిక నాయక్ అందరిని ఆకట్టుకుని వెలుగులోకి వచ్చింది.
  • మోడల్‌గా కెరియర్‌ను ఆరంభించిన ఈమె అశోకవనంలో అర్జున కళ్యాణం, హాయ్ నాన్న చిత్రాల్లో నటించింది.
  • వరుణ్ తేజ్, ఆనంద్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సరసన నటించడానికి రితిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
  • 2026లో ఈ రెండు ప్రాజెక్టులతో రితిక నాయక్ ఫుల్ బిజీగా గడపనుంది, కెరీర్‌లో పెద్ద మలుపు ఇది.

మిరాయ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న రితిక నాయక్ కెరీర్ ఇప్పుడు ఊపందుకుంది. వరుణ్ తేజ్, ఆనంద్ దేవరకొండ వంటి హీరోల సరసన నటించే అద్భుత అవకాశం దక్కించుకున్న రితిక, 2026లో భారీ ప్రాజెక్టులతో సందడి చేయనుంది. ఈ ముద్దుగుమ్మ లక్కీ ఛాన్స్ వివరాలు ఇక్కడ!

మిరాయ్’తో రితిక నాయక్ కెరీర్‌కు మలుపు

Ritika Nayak:రితిక నాయక్.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తేజా సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో వచ్చిన మిరాయ్ సినిమాలో తన అద్భుతమైన పాత్రతో అందరిని ఆకట్టుకుంది. తెలుగు భాష ఫాంటసీ మూవీ గా సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్ గా వచ్చిన ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. తేజ హీరోగా.. మంచు మనోజ్ విలన్ గా , జగపతిబాబు , జయరాం, శ్రియ శరన్, రితిక నాయక్ కీలక పాత్రలు పోషించారు. 2025 సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ముఖ్యంగా రితిక నాయక్ ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను దోచుకుంది. నిజానికి ఈమె పాత్రకు పెద్దగా స్కోప్ లేకపోయినా హీరోని తన లక్ష్యం వైపు నడిపించే పాత్రలో తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసి 100% మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అలా ఈ ఒక్క సినిమాతో వెలుగులోకి వచ్చింది రితిక నాయక్. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో లక్కీ ఛాన్స్ కొట్టేసింది అని చెప్పవచ్చు

విషయంలోకి వెళ్తే.. “వైబ్ ఉంది బేబీ”అంటూ కుర్రకారు హృదయాలను దోచుకున్న రితిక నాయక్ మిరాయ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలాంటి ఈమె ప్రస్తుతం వరుణ్ తేజ్ , ఆనంద్ దేవరకొండ వంటి హీరోల సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక 2026లో ఈ చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధం అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే మిరాయ్ సినిమాతో వెలుగులోకి వచ్చిన రితిక నాయక్ వచ్చే ఏడాది ఈ రెండు ప్రాజెక్టులతో ఫుల్ బిజీ కాబోతోందని చెప్పవచ్చు.

స్టార్ హీరోలతో రితిక లక్కీ ఛాన్స్

రితిక నాయక్ కెరియర్ విషయానికి వస్తే.. మోడల్గా కెరియర్ ను ఆరంభించిన ఈమె ఆ తర్వాత అశోకవనంలో అర్జున కళ్యాణం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇందులో చేసింది చిన్న పాత్ర అయినా తన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు సైమా అవార్డుకు ఉత్తమ తొలినటి విభాగంలో నామినేట్ కూడా అయ్యింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో కూడా చిన్న పాత్ర పోషించింది.

2026లో రితిక బిజీ షెడ్యూల్

బాల్యం , విద్యాభ్యాసం విషయానికి వస్తే 2000 సంవత్సరం అక్టోబర్ 26న ఢిల్లీలోని ఒడియా కుటుంబంలో జన్మించింది. ఢిల్లీ పోలీస్ పబ్లిక్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన రితిక నాయక్.. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని శ్యామ ప్రసాద్ ముఖర్జీ కాలేజ్ ఫర్ ఉమెన్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది. 2019లో ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ యొక్క 12వ సీజన్ టైటిల్ను గెలుచుకున్న ఈమె ఢిల్లీ టైమ్స్ ఫ్రెష్ సీజన్ 15 కి సెలబ్రిటీ జడ్జిగా ఆహ్వానించబడింది .ఆ తర్వాత తెలుగు దర్శకులను ఆకర్షించిన ఈమె ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారింది.

మొత్తం మీద, “మిరాయ్” సినిమా రితిక నాయక్ కెరీర్‌కు గొప్ప మలుపునిచ్చింది. ఆమె ప్రతిభకు గుర్తింపు లభించడమే కాకుండా, రాబోయే సంవత్సరంలో స్టార్ హీరోయిన్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. ఆమె సినీ ప్రయాణం మరింత విజయవంతం కావాలని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.