|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RJ Kajal: ప్రేమ పర్ఫెక్ట్‌గా లేదేమో.. ఎన్నో గొడవలు.. కొన్నిసార్లు పిచ్చోళ్లలా..

Published: 21-06-2025, 9:05 AM
RJ Kajal: ప్రేమ పర్ఫెక్ట్‌గా లేదేమో.. ఎన్నో గొడవలు.. కొన్నిసార్లు పిచ్చోళ్లలా..

నటి ఆర్జే కాజల్ తన భర్త విజయ్ శీలం శెట్టికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తమ జీవితంలోని ఎన్నో గొడవలు, సంతోషకరమైన క్షణాలను పంచుకుంటూ, వారి ప్రేమ గురించి ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు.

Key Points

1

ఆర్జే కాజల్ తన భర్తకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

2

వారి ప్రేమ జీవితంలోని గొడవలు, సంతోషకరమైన క్షణాలను పంచుకున్నారు.

4

వారి ప్రేమ పర్ఫెక్ట్‌గా లేకపోయినప్పటికీ, అందమైనది అని ఆమె పేర్కొన్నారు.

ఆర్జే కాజల్ భర్తకు జన్మదిన శుభాకాంక్షలు

ఈ సంవత్సరం తనకెంతో స్పెషల్‌ అంటోంది నటి ఆర్జే కాజల్‌ ( RJ Kajal ). బిగ్‌బాస్‌ సీజన్‌ 5తో బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ సోషల్‌ మీడియా వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది. తన భర్త విజయ్‌ శీలం శెట్టికి బర్త్‌డే విషెస్‌ చెప్తూ తమ జర్నీని రాసుకొచ్చింది. నా విజయ్‌కు హ్యాపీ బర్త్‌డే.. నువ్వు లేకుండా ఈ జీవితాన్ని ఊహించుకోలేను. 2025.. ఈ ఏడాదికి నా మనసులో ప్రత్యేక చోటు దక్కింది. ఎందుకంటే మన జీవితంలోనే కీలకమైన మైలురాయి అయిన సొంతింటి కలను నెరవేర్చుకున్నాం.

ఎన్నో గొడవలు ఇంకా ఆ ఇంట్లోకి మనం షిఫ్ట్‌ కాలేదనుకో.. కానీ, మనిద్దరం కలిసి ఆ ఇంటిని కొన్నందుకు ఆల్‌రెడీ అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఒకప్పుడు మనం చీకట్లో గుసగుసలాడుకునేవాళ్లం. ఇప్పుడవే గుసగుసలను ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటుంటే సంతోషంగా అనిపిస్తోంది. అలా అని మనమెప్పుడూ ఇంతే సంతోషంగా ఉండేవాళ్లం కాదు. ఎన్నోసార్లు పోట్లాడుకునేవాళ్లం. ఇంటీరియర్స్‌ గురించి, దిండుల గురించి, సమయపాలన గురించి.. కొన్నిసార్లయితే మరీ అనవసరమైన విషయాల గురించి కూడా గొడవపడేవాళ్లం.

వారి ప్రేమ జీవితంలోని ఎత్తుపల్లాలు

పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లం ఆ రోజులో ఎన్ని గొడవలు పడ్డా కూడా రాత్రయ్యేసరికి దాన్ని పరిష్కరించుకునేవాళ్లం. ప్రశాంతంగా నీ కౌగిలిలో నిద్రపోతుంటే మన ప్రేమ కంటే ఏ గొడవా పెద్దది కాదనిపించేది. మరికొన్నిసార్లు పిచ్చోళ్లలా నవ్వుకునేవాళ్లం. ఒకరి కాలు మరొకరు పట్టుకుని లాగేవాళ్లం. కొట్టుకుని అంతలోనే కలిసిపోయేవాళ్లం. మన బంధాన్ని మరింత ధృడంగా నిర్మించుకున్నాం. నువ్వు లేని జీవితం? అన్న ఆలోచనను కూడా నా దరిదాపుల్లోకి రానివ్వను.

మరణం తర్వాత కూడా.. కానీ సరదాగా ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు మనమేం అనుకునేవాళ్లం? మనిద్దరి శవాలను పక్కపక్కనే సమాధి చేసి మరణం తర్వాత కూడా కలిసే ఉండాలనుకునేవాళ్లం. అంత గొప్ప ప్రేమను మనం ఒకరికొకరం పంచుకున్నాం. మన లవ్‌ పర్ఫెక్ట్‌గా ఉండకపోవచ్చేమో కానీ, అందమైన ప్రేమను ఆస్వాదిస్తున్నాం. ఈ రోజు, నీ పుట్టినరోజున ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వే నా ప్రపంచం.. నువ్వు నాకోసమే పుట్టావు. నాకు భర్తగా దొరికినందుకు థాంక్యూ.. అని కాజల్‌ రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌కు భర్తతో కలిసి దిగిన ఫోటోలను జత చేసింది.

2025 – కొత్త ఇంటి కల నెరవేర్పు

తమ ప్రేమ జీవితంలోని ఎన్నో అనుభవాలను పంచుకున్న ఆర్జే కాజల్, తన భర్తతో ఉన్న బంధాన్ని మరింత బలపరుచుకుంటూ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వారి ప్రేమ యొక్క అందాన్ని ఈ పోస్ట్ చక్కగా వ్యక్తపరుస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.