
📌 Key Points
- సెల్వరాఘవన్ స్మోకింగ్ అలవాటు గురించి సంచలన వ్యాఖ్యలు!
- యువతకు ఆయన ఇచ్చిన సందేశం వైరల్ అవుతోంది.
- స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని సెల్వరాఘవన్ హెచ్చరిక.
- సినిమా ఇండస్ట్రీలో సెల్వరాఘవన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్!
ప్రముఖ దర్శకుడు, నటుడు సెల్వరాఘవన్ తన స్మోకింగ్ అలవాటు గురించి ఓపెన్ అవ్వడం హాట్ టాపిక్ అయింది. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
సెల్వరాఘవన్ స్మోకింగ్ అలవాటు వెనుక అసలు నిజం
తమిళ దర్శకుడు మరియు నటుడు అయినటువంటి సెల్వరాఘవన్ గురించి ప్రత్యేకంగా సినీ లవర్స్‌కు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన దర్శకత్వంలో రూపొందిన ఎన్నో సినిమాలు, అలాగే ఈయన నటించిన అనేక చిత్రాలు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ నటుడికి టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు లభించింది. ఇక సెల్వరాఘవన్‌కు స్మోకింగ్ చేసే అలవాటు ఉంది. తాజాగా ఈయన సినీ అనలిస్ట్ అమూత భారతి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన స్మోకింగ్ అలవాటు గురించి ఓపెన్‌గా మాట్లాడారు.
అమూత భారతి అడిగిన ప్రశ్నకు స్పందించిన సెల్వరాఘవన్… తాను మార్చుకోవాలనుకునే ఒకే ఒక అలవాటు ‘స్మోకింగ్’ అని ఓపెన్ గానే చెప్పారు. “స్మోకింగ్ హ్యాబిట్ ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, దానిని మానడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను, కానీ ఆది జరగలేదు. అవకాశం వస్తే తప్పకుండా సిగరెట్ స్మోకింగ్ మానేస్తానని చెప్పారు. ఎవరైనా నా మాట వింటే నేను ఒకే విషయం చెబుతాను… ఏం చేసినా పర్లేదు కానీ ఎప్పుడూ కూడా స్మోకింగ్ జోలికి వెళ్ళద్దని తెలిపారు. ఈ నటుడు మరియు దర్శకుడు ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి ఓపెన్‌గా మాట్లాడటం, యువతకు అవగాహన కలిగించే విధంగా ఉందని పలువురు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యువతకు సెల్వరాఘవన్ ఇచ్చిన మాస్ వార్నింగ్
టాలీవుడ్‌లో సెల్వరాఘవన్ కామెంట్స్ వైరల్!
సెల్వరాఘవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అభిమానులు ఆయన మాటలకు మద్దతు తెలుపుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

