
📌 Key Points
- రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ మూవీ
- దిల్ రాజు నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా సినిమా
- విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది
- ఫ్లాష్ బ్యాక్ లో విజయ్ దేవరకొండ తల్లిగా శోభన
విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్ధన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి శోభన విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.
రౌడీ జనార్ధన్ మూవీ విశేషాలు
Rowdy Janardhan: టాలీవుడ్ అండ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నప్పటికీ తన సినిమాల ద్వారా మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి రొటీన్ కి భిన్నంగా స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రెండు సినిమాల్లో షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు .ఈ రెండు సినిమాలు కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈయన డైరెక్టర్ రవి కిరణ్ కోలా డైరెక్షన్లో రౌడీ జనార్దన్(Rowdy Janardhan) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
దిల్ రాజు నిర్మాణ సంస్థలో ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా 2026 లోనే విడుదల కాబోతున్నట్టు దిల్ రాజు ఓ సందర్భంలో వెల్లడించారు. ఇటీవల రౌడీ జనార్ధన్ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో సినిమా పట్ల భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్(Keerthy Suresh) నటించబోతున్న నేపథ్యంలో ఈ సినిమా పట్ల భారీ అంచనాలే ఉన్నాయి.
విజయ్ దేవరకొండ తల్లిగా శోభన
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ లో సీనియర్ నటి సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు తల్లి పాత్రలో సీనియర్ నటి శోభన (Shobhana) నటించబోతున్నట్టు సమాచారం. విజయ్ దేవరకొండ తల్లి పాత్ర ఎమోషన్స్ తో ఉండబోతుందని ఈ పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని తెలుస్తుంది. ఇలా కీలక పాత్ర కావడంతో సీనియర్ నటి శోభనను ఎంపిక చేసినట్టు సమాచారం.
కల్కి సినిమాతో రీ ఎంట్రీ..
సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్
ఈ సినిమా తారాగణం విషయంలో దర్శక నిర్మాతలు ఆచితూచి అడుగులు వేస్తూ సరైన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారు. శోభన ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగు గారు అయితే తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ఇటీవల నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శోభన ప్రస్తుతం కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈమె రౌడీ జనార్ధన్ సినిమా పనులలో భాగం కాబోతున్నట్టు సమాచారం.
మొత్తానికి రౌడీ జనార్ధన్ సినిమాలోని ఈ ఆసక్తికరమైన విషయాలు సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. శోభన రీ ఎంట్రీతో సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.


