|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రౌడీ జనార్ధన గ్లింప్స్: విజయ్ దేవరకొండ విశ్వరూపం! ఈసారి బాక్సాఫీస్ షేక్ పక్కా?

Published: 22-12-2025, 10:44 AM
రౌడీ జనార్ధన గ్లింప్స్: విజయ్ దేవరకొండ విశ్వరూపం! ఈసారి బాక్సాఫీస్ షేక్ పక్కా?
  • విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘రౌడీ జనార్ధన’.
  • రవికిరణ్ కోల దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.
  • పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్ర గ్లింప్స్ అదరగొట్టింది.
  • ‘కింగ్డమ్’ లాంటి వైఫల్యాల తర్వాత ఈసారి హిట్టు పక్కా అంటున్నారు.

విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్ధన’ చిత్ర గ్లింప్స్ విడుదల చేసింది. గత సినిమాల నిరాశ తర్వాత, VDకు ఇది చాలా కీలకం. బీభత్సమైన యాక్షన్, పీరియాడిక్ నేపథ్యంతో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి విజయ్ కచ్చితంగా హిట్టు కొట్టాలని చూస్తున్నాడు.

విజయ్ దేవరకొండకు హిట్టు అత్యవసరం

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చివరి చిత్రం కింగ్డమ్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. అంతకు ముందు విజయ్ దేవరకొండ నటించిన కొన్ని సినిమాలు కూడా నిరాశ పరిచాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండకి ఒక మంచి హిట్టు అవసరం. ఈ తరుణంలో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి రౌడీ జనార్ధన అనే టైటిల్ అనౌన్స్ చేస్తూ తాజాగా టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. రౌడీ జనార్దన్ మూవీ కూడా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోంది. టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది అనే చెప్పాలి. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

‘రౌడీ జనార్ధన’ గ్లింప్స్ హైలైట్స్

ఈ చిత్రం పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్నట్లు టైటిల్ గ్లింప్స్ చూస్తుంటే అర్థం అవుతోంది. ‘బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి విన్నావా, నేను చూశాను అనే వాయిస్ ఓవర్ తో టైటిల్ గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. విజయ్ దేవరకొండ కత్తి పట్టుకుని బీభత్సం సృష్టిస్తున్నాడు.

అంచనాలతో వస్తున్న పీరియాడిక్ డ్రామా

కళింగ పట్నంలో ఇంటికొకడు నేను రౌడీని అని చెప్పుకు తిరుగుతాడు. కానీ ఇంటి పేరునే రౌడీగా మార్చుకున్నోడు ఒక్కడే ఉన్నాడు ఆంటూ విజయ్ దేవరకొండ చెబుతున్న డైలాగ్ తో ఈ చిత్రం ఎంత వయలెంట్ గా ఉండబోతోందో అర్థం అవుతోంది. మొత్తానికి కింగ్డమ్ లాగా మిస్ కాకూడదని విజయ్ దేవరకొండ గట్టిగా డిసైడ్ అయినట్లు ఉన్నాడు. వచ్చే ఏడాది డిసెంబర్ లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.

మొత్తంగా ‘రౌడీ జనార్ధన’ గ్లింప్స్ విజయ్ దేవరకొండకు అద్భుతమైన కమ్‌బ్యాక్‌గా కనిపిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బీభత్సం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.