|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆర్ఆర్ఆర్ పార్ట్ 2.. యస్ అంటున్న రాజమౌళి.. వీడియో వైరల్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Published: 14-05-2025, 11:41 PM
ఆర్ఆర్ఆర్ పార్ట్ 2.. యస్ అంటున్న రాజమౌళి.. వీడియో వైరల్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ 2 గురించి ఆసక్తికరమైన ప్రకటన చేశారు.

Key Points

1

రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ 2 కు 'యస్' అన్నారని వీడియో వైరల్ అవుతోంది.

2

రామ్ చరణ్ భార్య ఉపాసన ఆ ప్రశ్న అడిగారు.

4

ఫ్యాన్స్ ఆర్ఆర్ఆర్ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ లో వైరల్ వీడియో

రీసెంట్ గా లండన్ లోని ప్రఖ్యాత రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ‘ఆర్ఆర్ఆర్’ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ జరిగింది. ‘బాహుబలి 2’ తర్వాత ఈ ఘనత దక్కించుకున్న రెండో తెలుగు సినిమాగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. దీంతో ఆర్ఆర్ఆర్ పేరు మరోసారి ప్రపంచ స్థాయిలో మార్మోగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ పార్ట్ 2 గురించి చర్చ జోరందుకుంది. దీనిపై తాజాగా డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి రియాక్షన్ వైరల్ గా మారింది.

రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఆర్ఆర్ఆర్ లైవ్ కాన్సర్ట్ సందర్భంగా అమేజింగ్ మూమెంట్స్ కలిగిన వీడియోను రామ్ చరణ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఇందులో రామ్ చరణ్, రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి ఉన్నారు. ఎన్టీఆర్ , రామ్ చరణ్ కలిసి రాజమౌళిని ఆట పట్టించారు. గిలిగింతలు పెట్టారు. ఆ సమయంలోనే వీడియో తీస్తున్న రామ్ చరణ్ భార్య ఉపాసన ఓ ప్రశ్న అడిగారు.

రాజమౌళి రియాక్షన్

‘‘రాజమౌళి గారు మీరు ఆర్ఆర్ఆర్ 2 తీస్తారా’’ అని ఉపాసన అడిగారు. కాసేపు ఆలోచించిన రాజమౌళి ‘యస్’ అని అన్నారు. వెంటనే ఉపాసన కాస్త వెటకారంగానే ‘గాడ్ బ్లెస్ యూ’ అన్నారు. అంటే రామ్ చరణ్, తారక్ తో వేగడం కష్టమేనన్న ఫీలింగ్ లో ఉపాసన అలా అన్నారు. ఏదైమైనా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. ‘ఆర్ఆర్ఆర్ ఫరెవర్’ అనే క్యాప్షన్ తో చరణ్ ఈ వీడియోను పోస్టు చేశారు.

2022లో రిలీజైన ఆర్ఆర్ఆర్ ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.ఈ మూవీలో తారక్, చరణ్ యాక్టింగ్ అదిరిపోయింది. రాజమౌళి టేకింగ్ మరో రేంజ్ లో ఉంది. అందుకే ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

ఆర్ఆర్ఆర్ 2 పై ఫ్యాన్స్ ఆసక్తి

గతంలో చికాగోలో జరిగిన ఈవెంట్ లో.. ‘‘నా తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి చర్చ జరిగింది. ఆయన ఈ కథపై పని చేస్తున్నారు’’ అని రాజమౌళి చెప్పారు. మరి ఈ సీక్వెల్ ఉంటుందా? ఉంటే ఎప్పుడు కుదురుతుంది? అనేది హాట్ టాపిక్ గా మారింది. రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో కలిసి ఎస్ఎస్ఎంబీ 29 చేస్తున్నారు. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నారు. తారక్ ఏమో ‘వార్ 2’, ‘డ్రాగన్’ అంటూ వరుస సినిమాలు లైన్లో పెట్టారు.

రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబినేషన్ మరోసారి తెరపైకి రావడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఆర్ఆర్ఆర్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.