|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది.. టాక్సిక్ మూవీపై రుక్మిణి వసంత్ కామెంట్స్

Published: 06-11-2025, 12:16 PM
రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది.. టాక్సిక్ మూవీపై రుక్మిణి వసంత్ కామెంట్స్

యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై హీరోయిన్ రుక్మిణి వసంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమా ‘రా అండ్ రస్టిక్‌గా’, ఎన్నో లేయర్స్‌తో ఉంటుందని, భారతీయ సినిమాల్లో చూసిన వాటికంటే భిన్నంగా ఉంటుందని ఆమె వెల్లడించింది. 2026లో విడుదల కానున్న ఈ మూవీకి గీతు మోహన్‌దాస్ దర్శకత్వం.

Key Points

1

యష్ 'టాక్సిక్' మూవీ మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల.

2

హీరోయిన్ రుక్మిణి వసంత్ 'టాక్సిక్' విశేషాలను పంచుకుంది.

4

గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో బహుభాషా చిత్రంగా 'టాక్సిక్' రానుంది.

రుక్మిణి వసంత్ చెప్పిన ‘టాక్సిక్’ విశేషాలు

రాకింగ్ స్టార్ యష్ త్వరలో ‘టాక్సిక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం బెంగుళూరులో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ డ్రామా మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఈ మూవీలో క్రేజీ అండ్ సెన్సేషనల్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్‌లో పాల్గొన్న ఈ బ్యూటీ ‘టాక్సిక్’ విశేషాలు పంచుకుంది. ‘‘టాక్సిక్’ అనేది ఇప్పటివరకు కన్నడ లేదా భారతీయ సినిమాల్లో మనం చూసిన వాటన్నంటికంటే భిన్నంగా ఉంటుంది. ఇది రా అండ్ రస్టిక్‌గా ఎన్నో లేయర్స్‌తో అద్భుతంగా ఉండబోతోంది. దర్శకురాలు గీతు విజన్ ఎంతో బోల్డ్‌గా ఉంటూనే.. అదే సమయంలో ఎంతో హృద్యంగానూ ఉంటుంది.. ఈ సినిమా ప్రేక్షకులకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది’ అంటూ రుక్మిణి చెప్పిన మాటలతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. కన్నడ, ఆంగ్ల భాషలలో చిత్రీకరించబడుతున్న ఈ భారీ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో ఒకేసారి రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అవుతున్నది. కెవిఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్నా ఈ చిత్రానికి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన మేకర్ గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు.

A post shared by Rukmini Vasanth (@rukmini_vasanth)

‘టాక్సిక్’ మూవీ కథాంశం, విడుదల తేదీ

గీతు మోహన్‌దాస్ దర్శకత్వం, నిర్మాణ సంస్థలు

మొత్తంగా, రుక్మిణి వసంత్ చేసిన వ్యాఖ్యలు ‘టాక్సిక్’ మూవీపై అంచనాలను భారీగా పెంచాయి. దర్శకురాలు గీతు మోహన్‌దాస్ విజన్, యష్ స్టార్‌డమ్‌తో రాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.