
వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘శబరి’ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా దాసరి ఫిలిం అవార్డ్స్ లో ఉత్తమ కథా చిత్రంగా ఈ సినిమా అవార్డు అందుకుంది. ఒక తల్లి తన కూతురును కాపాడుకోవడానికి చేసే పోరాటం ఈ చిత్ర కథాంశం.
Key Points
వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ‘శబరి’ సినిమా దాసరి ఫిలిం అవార్డ్ గెలుచుకుంది.
ఉత్తమ కథా చిత్రంగా ఈ అవార్డును సినిమా అందుకుంది.
‘శబరి’ సినిమా ఒక తల్లి తన కూతురును కాపాడుకోవడానికి చేసే పోరాటం గురించి.
ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదలైంది.
‘శబరి’ సినిమాకు అవార్డు
Sabari Movie : వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ గా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా గత సంవత్సరం మేలో ‘శబరి’ అనే సినిమా రిలీజయింది. మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మాణంలో అనిల్ కాట్జ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. శబరి సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో రిలీజ్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా sunNXT ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.
తల్లి-కూతురు బంధం
తాజాగా ఈ సినిమా దాసరి ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ కథా చిత్రంగా అవార్డు సాధించింది. ఒక తల్లి తన కూతుర్ని కాపాడుకోవాలి, తన కూతురు కోసం చేసే పోరాటంతో ఈ సినిమా తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లింగ్ కథాంశంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. ప్రతి సంవత్సరం జరిగే దాసరి ఫిలిం అవార్డ్స్ తాజాగా జరగ్గా ఇందులో ఉత్తమ కథా చిత్రం అవార్డు అందుకుంది శబరి సినిమా.
పాన్ ఇండియా విడుదల
ఈ అవార్డుని నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల అనిల్ రావిపూడి, సాయి కుమార్, సుమన్, మురళి మోహన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సినిమా నిర్మాతగా మహేంద్ర నాథ్ కూండ్లకు మొదటి సినిమా కావడం గమనార్హం. మొదటి సినిమాకు ఇలాంటి డిఫరెంట్ కథ, ఎమోషన్స్ ఉన్న సినిమా తీయడం గ్రేట్ అని అవార్డ్స్ కమిటీ ప్రశంసించింది.
మొదటి సినిమాకే ‘శబరి’ లాంటి ప్రశంసలు అందుకోవడం నిర్మాతకు గర్వకారణం. ఈ అవార్డు సినిమా యొక్క విజయాన్ని మరింతగా చాటుతుంది.


