|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మెగా హీరో సాయి దుర్గ తేజ్ సంచలనం! ‘క’ దర్శకులతో యుద్ధానికి సై!

Published: 03-04-2026, 6:35 AM
మెగా హీరో సాయి దుర్గ తేజ్ సంచలనం! 'క' దర్శకులతో యుద్ధానికి సై!
  • సాయి దుర్గ తేజ్ 19వ సినిమాను సుజిత్-సందీప్ ద్వయం దర్శకత్వం వహించనున్నారు.
  • ఈ చిత్రానికి షైన్ స్క్రీన్స్, విజయదుర్గ ప్రొడక్షన్ బ్యానర్‌లపై నిర్మాణం జరుగుతుంది.
  • సాయి దుర్గ తేజ్ ఈ సినిమాలో యోధుడిగా కనిపించనున్నాడని పోస్టర్ ద్వారా తెలుస్తోంది.
  • సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాలో నటిస్తున్నారు.

మెగా హీరో సాయి దుర్గ తేజ్ తన 19వ సినిమాను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు సుజిత్-సందీప్ దర్శకత్వం వహించనున్నారు. పోస్టర్ ద్వారా సాయి దుర్గ తేజ్ యోధుడిగా కనిపించనుండడం విశేషం.

సాయి దుర్గ తేజ్ 19వ సినిమా ప్రకటన

Sai Durga Tej: మెగా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణను సొంతం చేసుకున్న వారిలో సాయి దుర్గ తేజ్(Sai Durga Tej) ఒకరు. ఇటీవల విభిన్నమైన కథ చిత్రాలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సాయి దుర్గ తేజ ఇప్పటివరకు 18 సినిమాలలో నటించారు. తాజాగా ఈయన 19వ సినిమా అని కూడా అధికారకంగా ప్రకటించారు. గత కొంతకాలంగా సాయి దుర్గ తేజ్ కొత్త సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఇక నేడు తన 19వ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన తెలియజేయడమే కాకుండా పోస్టర్ కూడా విడుదల చేశారు.

సాయి దుర్గతేజ్ తన 19వ సినిమాని ‘క ‘ సినిమా ద్వయం దర్శకులు సుజిత్- సందీప్(Sujeeth -Sandeep) దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాకు షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి, విజయదుర్గ ప్రొడక్షన్ బ్యానర్ పై సాయి దుర్గ తేజ్ కూడా నిర్మాతలుగా వ్యవహరించబోతున్నారు. ఇక నేడు ఈ సినిమా అధికారకంగా ప్రకటించారు త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని అధికారికంగా ప్రకటిస్తూ.. యుగాలనాటి రహస్యాలు.. ఊహ కందని శక్తి. అత్యంత శక్తివంతమైన ఒక ప్రయాణంలోకి అడుగు పెడుతున్నాం అంటూ సాయి ధరమ్ తేజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే ఈ సినిమాలో సాయి దుర్గా తేజ ఒక యోధుడిగా కనిపించబోతున్నారని స్పష్టమవుతుంది. హీరో కత్తి పట్టుకుని ఎంతో గాంభీర్యంగా కనిపిస్తుండడంతో ఈ సినిమా గత యుగం కాలంనాటి కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టం అవుతుంది. ఇలా అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశారు.  అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్ పనులను జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసి సాయి ధరమ్ తేజ్ తన 19వ సినిమా షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు.

దర్శకులుగా సుజిత్-సందీప్ ద్వయం

Secrets of the Ages… Power beyond imagination.

Stepping into something truly powerful…

Excited to be part of this journey with the Dynamic directors @Dir_Sujith & @Dir_SandeepM and Passionate Producer @Sahugarapati7 anna #SDT19 #CosmicChronicles @Shine_Screens … pic.twitter.com/OxXyLhUK6S

యోధుడిగా సాయి దుర్గ తేజ్ లుక్

— Sai Dharam Tej (@IamSaiDharamTej) April 3, 2026

రోహిత్ కె.పి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ పాన్-ఇండియా సినిమాగా ‘సంబరాల ఏటిగట్టు’ (Sambarala Yeti Gattu – SYG) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సాయి దుర్గ తేజ్ జోడిగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇటీవల హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదల చేయగా ఎంతో మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

సాయి దుర్గ తేజ్ తన తదుపరి సినిమాతో సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యోధుడిగా ఆయన ఎలా మెప్పిస్తారో చూడాలి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.