
📌 Key Points
- సాయి పల్లవి అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ తో ‘ఏక్ దిన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు.
- అమీర్ ఖాన్ సాయి పల్లవిని ప్రశంసించి, తన తదుపరి సినిమాలో పవర్ ఫుల్ పాత్రకు అవకాశం ఇచ్చారు.
- సాయి పల్లవి ‘రామాయణం’ సినిమాలో నటిస్తున్నారు, ఇది 2026, 2027లో రెండు భాగాలుగా విడుదల.
- ప్రభాస్ ‘కల్కి 2’లో సుమతి పాత్రకు ఎంపికైనట్లు వార్తలు, కానీ అధికారిక ప్రకటన లేదు.
సాయి పల్లవి బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. అమీర్ ఖాన్ కుమారుడితో ‘ఏక్ దిన్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆమెకు, అమీర్ ఖాన్ స్వయంగా మరో పవర్ ఫుల్ ఆఫర్ ఇచ్చారు. ‘రామాయణం’ వంటి భారీ ప్రాజెక్టులలో నటిస్తున్న సాయి పల్లవి, టాలీవుడ్‌కు గుడ్‌బై చెబుతారా అనే చర్చ మొదలైంది.
బాలీవుడ్‌లో సాయి పల్లవికి బంపర్ ఆఫర్స్
Sai Pallavi: నాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi)ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రేమమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె అనంతరం తెలుగు తమిళ భాషలలో కూడా సినిమా అవకాశాలను అందుకుంటూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా సాయి పల్లవి బాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ జోడిగా ఏక్ దిన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఈమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
అమీర్ ఖాన్ సినిమాలో సాయి పల్లవి?
ఇలా ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇటీవల ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్(Aamir Khan) సాయి పల్లవి గురించి మాట్లాడుతూ ఆమెపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. సాయి పల్లవి అద్భుతమైన నటి అంటూ అమీర్ ఖాన్ ప్రశంసలు కురిపించడమే కాకుండా సాయి పల్లవికి అదిరిపోయే ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. అమీర్ ఖాన్ తన తదుపరి సినిమాలో సాయి పల్లవికి ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చినట్టు సమాచారం.
అమీర్ ఖాన్ ప్రశంసలు, మరో అవకాశం
అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరో స్వయంగా సాయి పల్లవికి పిలిచి మరి అవకాశం ఇచ్చారు అంటే సాయి పల్లవికి ఎలాంటి క్రేజ్ ఉందో స్పష్టంగా అర్థం అవుతోంది. ఇలా సాయి పల్లవి నటించిన ఒక్క బాలీవుడ్ సినిమా కూడా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు రాలేదు కానీ ఈమెకు మాత్రం బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. ప్రస్తుతం ఏక్ దిన్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం రామాయణ సినిమాలో కూడా సాయి పల్లవి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
టాలీవుడ్ కు దూరమవుతున్నారా?
టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పేస్తున్నారా?
రామాయణ మొదటి భాగం 2026 దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక రెండో భాగం 2027 దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇలా వరుస బాలీవుడ్ సినిమాలతో పాటు మరోవైపు తెలుగు సినిమాలలో కూడ నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా కల్కి 2 సినిమాలో సుమతి పాత్రలో సాయి పల్లవి ఎంపిక అయినట్టు వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం మాత్రం అధికారక ప్రకటన వెల్లడించలేదు. ఈ సినిమా మినహా సాయి పల్లవి తెలుగులో ఎలాంటి సినిమాలు చేయలేదని తెలుస్తోంది. ఇలా వరుసగా బాలీవుడ్ సినిమా అవకాశాలను అందుకుంటున్న నేపథ్యంలో ఈమె తెలుగు ఇండస్ట్రీ గుడ్ బై చెప్పబోతున్నారా? ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్థిరపడుతున్నారా? అంటూ అభిమానులు కూడా సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.
బాలీవుడ్‌లో సాయి పల్లవికి పెరుగుతున్న క్రేజ్, వరుస ప్రాజెక్టులు ఆమె కెరీర్‌కు కొత్త మలుపునిస్తున్నాయి. అయితే, టాలీవుడ్‌లో ఆమె భవిష్యత్తుపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆమె తెలుగు ప్రేక్షకులను దూరం చేసుకుంటారా అనేది వేచి చూడాలి.


