
📌 Key Points
- నయనతార పేరును ప్రస్తావిస్తూ శణ్ముగం చేసిన వ్యాఖ్యలపై మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు.
- రాజకీయ లబ్ధి కోసం నటీమణులపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని మంచు విష్ణు అన్నారు.
- మహిళలను శక్తి స్వరూపిణిగా గౌరవించాలని, వారిని అవమానించకూడదని మంచు విష్ణు హితవు పలికారు.
- గతంలో పవన్ కళ్యాణ్ గురించి ఎందుకు మాట్లాడలేదని నెటిజన్లు మంచు విష్ణుని ప్రశ్నిస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో నయనతార పేరును ప్రస్తావిస్తూ AIADMK ఎంపీ సి.వి. శణ్ముగం చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందిస్తూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ లబ్ధి కోసం నటీమణులను కించపరచడం సరికాదన్నారు.
నయనతారపై ఎంపీ వ్యాఖ్యలకు మంచు విష్ణు కౌంటర్
Manchu Vishnu: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. లేడీ సూపర్ స్టార్‌గా పేరొందిన నయనతార (Nayanthara) పేరు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యల కారణంగా AIADMK పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సి.వి. శణ్ముగం విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేవిగా ఉన్నాయని డీఎంకే పార్టీ నాయకులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, నటుడు మంచు విష్ణు (Manchu Vishnu) స్పందించారు. మహిళలను శక్తి స్వరూపిణిగా భావించి, గౌరవించే చోట.. కేవలం రాజకీయ లబ్ధి కోసం, జనాల్లో వైరల్ అవడం కోసం ఒక నటిపై అవమానకర వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని, మర్యాద తెలుసుకుని మాట్లాడాలని మంచు విష్ణు హితవు పలికారు.
‘‘తమిళనాడులో జరుగుతున్న రాజకీయ ప్రచారాల కోసం ఏ సంబంధం లేని నటీమణులను లాగడం చూస్తుంటే వాళ్లెంత తక్కువ స్థాయి వ్యక్తులో అర్థమవుతోంది. ఇది కేవలం తమిళనాడులోనే (Tamil Nadu Politics) కాదు, అన్ని చోట్ల ఇదే పద్ధతి కనిపిస్తోంది. నటీనటులు రాజకీయ విమర్శలకు వేదికలు కాదు. వారికి కూడా తెర వెనుక కుటుంబం, ఆత్మగౌరవం, వ్యక్తిగత జీవితం ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడే సమయంలో మర్యాద మరిచిపోయి మాట్లాడకూడదు. ముఖ్యంగా మహిళలను కించపరిచే విధంగా కామెంట్స్ చేయకూడదు. భారతీయ సంస్కృతి మూలాల్లో మహిళలను శక్తి స్వరూపిణిగా భావించి గౌరవిస్తాం. అంతేకానీ వారిని కేవలం వార్తల్లో హెడ్‌లైన్స్ కోసమో లేదంటే అవమానాలకో పరిమితం చేయకండి. కనీసం ఇకనైనా మారుదాం..’’ అని మంచు విష్ణు ఎక్స్ వేదికగా సదరు ఎంపీని ఉద్దేశించి పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజకీయాల్లో నటీమణుల ప్రస్తావనపై విష్ణు అసహనం
ఇక ఈ పోస్ట్‌కు నెటిజన్ల కామెంట్స్ ఇంకో రకంగా ఉన్నాయి. ఏపీలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ల అమ్మని, భార్యని ఎన్నో మాటలు అన్నారు. అప్పుడేం చేస్తున్నావ్.. అంటూ మంచు విష్ణుని ప్రశ్నిస్తున్నారు. నిజంగా నీకు నిజాయితీగా స్పందించే గుణం ఉంటే, అప్పుడు ఏమైపోయావ్, ఏ వాళ్లు ఆడవాళ్లు కాదా? అంటూ నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ విష్ణుని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే మరి, ఎవరికైనా ఒకటే న్యాయం ఉండాలి. అందులోనూ ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. అప్పుడందరినీ సమానంగానే చూడాలి. సమయాన్ని బట్టి, మనుషులను బట్టి మారతాను, మాట్లాడతాను అంటే.. ఇలాగే కామెంట్స్ పడతాయ్ మరి. కాబట్టి మంచు విష్ణు కూడా మారాలి.. అనేలా నెటిజన్ల కామెంట్స్ ఉన్నాయి.
Reading about the political campaigns in my Tamil Nadu. Felt It’s in extremely poor taste to drag actresses into political narratives. Not just in TN but anywhere.
గతంలో పవన్ కళ్యాణ్ విషయంలో విష్ణు మౌనంపై ప్రశ్నలు
Actors are not political punching bags. They are individuals with families, dignity, and a life beyond the…
— Vishnu Manchu (@iVishnuManchu) March 17, 2026
మొత్తానికి మంచు విష్ణు స్పందన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కొందరు ఆయనను సమర్థిస్తుంటే, మరికొందరు గతంలో ఆయన వ్యవహరించిన తీరును ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి.


