
ఒకప్పటి తార ఆమని ‘హ్యాపీ జర్నీ’ సినిమా షూటింగ్‌లో జరిగిన సంచలన విషయాలను బయటపెట్టి టాలీవుడ్‌ను షేక్ చేసింది. పారిస్‌లో వైన్ ట్యాంక్, ర్యాబిట్ మాంసంతో కూడిన విందు గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ వార్త ఫ్యాన్స్‌లో తీవ్ర ఉత్సాహాన్ని నింపుతోంది.
Key Points
హీరోయిన్ ఆమని 'హ్యాపీ జర్నీ' పారిస్ షూటింగ్ విశేషాలు పంచుకుంది, సంచలనం.
సెట్‌లో వైన్ ట్యాంక్, చికెన్, మటన్, ర్యాబిట్ మాంసంతో విందు, వైరల్.
22 రోజులు పారిస్‌లో షూటింగ్, ఆర్టిస్టుల ఎంజాయ్ మెంట్ పీక్స్.
ఆమని డైట్ బ్రేక్ చేసి ఫుడ్ ఎంజాయ్ చేసింది, ఇప్పుడు చర్చనీయాంశం.
పారిస్ లో ‘హ్యాపీ జర్నీ’ టీమ్ విందు విశేషాలు!
Aamani : ఒకప్పటి హీరోయిన్ ఆమని ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంది. ఆమని ప్రస్తుతం హ్యాపీ జర్నీ అనే సినిమాలో నటిస్తుంది. అన్నపూర్ణమ్మ, ఝాన్సీ, ఆమని, పాయల్ రాధాకృష్ణ, రవి శివతేజ, వంశీ.. ఇలా చాలా మంది ఆర్టిస్టులతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇంతమంది కలిసి ప్యారిస్ వెళ్లి ఏం చేసారు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుంది.
ఆమని మాటల్లో వైన్, ర్యాబిట్ మాంసం కథ!
ఈ సినిమా షూటింగ్ మొత్తం ప్యారిస్ లోనే జరిగింది. దాదాపు 22 రోజులు ఈ ఆర్టిస్టులు అంతా ప్యారిస్ లోనే ఉండి సినిమా షూట్ పూర్తి చేశారు. తాజాగా హ్యాపీ జర్నీ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో నటి ఆమని మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
షూటింగ్ స్పాట్ లో స్టార్స్ ఎంజాయ్ మెంట్!
ఆమని మాట్లాడుతూ.. ఈ మధ్య కాలంలో ఇంత మంచి ప్రొడక్షన్ హౌస్ చూడలేదు. అక్కడ భోజనాలు అయితే సూపర్. అసలు నేను మాములుగా డైట్ లో ఉంటాను కానీ అక్కడ డైట్ లో లేను మొత్తం తినేసాను. డిన్నర్ లో ఒక పెద్ద ట్యాంక్ పెట్టేవారు. ట్యాంక్ నిండా వైన్ ఉంటుంది. అందరూ వెళ్లడం అది ఓపెన్ చేసి పట్టుకోవడం తాగడమే ఎవరికి వాళ్ళు. నాన్ వెజ్ అయితే చికెన్, మటన్, ప్రాన్స్, ర్యాబిట్.. చాలా వెరైటీలు పెట్టారు. నేనైతే అవి తినలేదు వెజిటేరియన్ కాబట్టి అని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్.
ఆమని చేసిన ఈ వ్యాఖ్యలు ‘హ్యాపీ జర్నీ’ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. పారిస్ షూటింగ్ విశేషాలు, విందు వార్తలు సినిమాకు మరింత పబ్లిసిటీ తెస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి!


