|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జూలైలో సంచలనం! తక్కువ ధరలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు – కొనడానికి సిద్ధంగా ఉండండి!

Published: 08-07-2026, 5:06 AM
జూలైలో సంచలనం! తక్కువ ధరలో టాప్ 5 స్మార్ట్‌ఫోన్లు - కొనడానికి సిద్ధంగా ఉండండి!

జూలైలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? నథింగ్, ఒప్పో వంటి బ్రాండ్‌ల నుండి రాబోయే టాప్ 5 చీపెస్ట్ ఫోన్‌ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లు, భారీ బ్యాటరీ, శక్తివంతమైన కెమెరాలతో తక్కువ ధరకే ఈ ఫోన్‌లు అందుబాటులోకి రానున్నాయి.

Key Points

1

జూలైలో నథింగ్, వన్‌ప్లస్, ఒప్పో, శాంసంగ్, టెక్నోల నుండి కొత్త ఫోన్లు రానున్నాయి.

2

నథింగ్ ఫోన్ 4b 120Hz అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుంది.

4

ఒప్పో రెనో 16లో మూడు 50MP సెన్సార్లు, 3.5x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి.

జూలైలో రాబోయే టాప్ 5 చీపెస్ట్ ఫోన్లు

Top 5 upcoming phones in July 2026

Upcoming Phones july 2026 : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? వచ్చే నెల జూలైలో సరికొత్త ఫీచర్లతో అద్భుతమైన ఫోన్లు రాబోతున్నాయి. నథింగ్, వన్‌ప్లస్, ఒప్పో, శాంసంగ్, టెక్నో వంటి బ్రాండ్‌లు వివిధ ధరల్లో కొత్త ఫోన్లను లాంచ్ చేయనున్నాయి.

కొన్ని బ్రాండ్ల ఫోన్లలో భారీ బ్యాటరీలపై ఫోకస్ పెట్టగా మరికొన్ని ఫోన్లలో అద్భుతమైన కెమెరాలతో భారత (Upcoming Phones) మార్కెట్లో అడుగుపెట్టనున్నాయి. ఫ్లాగ్‌షిప్ ధర కాకపోయినా ప్రీమియం ఎక్స్ పీరియన్స్ మాత్రం పక్కా అందించనున్నాయి. జూలై నెలలో రాబోయే టాప్ 5 అత్యంత చౌకైన స్మార్ట్‌ఫోన్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం..

నథింగ్ ఫోన్ 4b : నథింగ్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ రేంజ్ రాబోతుంది. ఆ కంపెనీ రాబోయే సరసమైన ఫోన్నథింగ్ ఫోన్ 4b వచ్చేస్తోంది. ఈ ఫోన్ 3 కలర్ ఆప్షన్లలో రానుంది. 8GB + 128GB, 8GB + 256GB స్టోరేజ్‌తో సహా 2 స్టోరేజ్ వేరియంట్లలో వస్తుందని అంచనా. లీకుల ప్రకారం.. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే ఉండొచ్చు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్‌తో వస్తుందని అంచనా.

నథింగ్ రిలీజ్ చేసిన ఫొటోల్లో నథింగ్ ఫోన్ 4b డ్యూయల్-కెమెరా సెటప్‌ అందిస్తుంది. బహుశా 50MP ప్రైమరీ సెన్సార్ ఉండొచ్చు. ఈ ఫోన్‌లో 5,400mAh బ్యాటరీ కూడా ఉంటుందని అంచనా. మొత్తం మీద, క్లీన్ సాఫ్ట్‌వేర్ ఎక్స్ పీరియన్స్, స్పెషల్ డిజైన్ కోరుకునే కొనుగోలుదారులకు నథింగ్ ఫోన్ 4b బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ఒప్పో రెనో 16 : ఒప్పో రెనో 16 వచ్చే నెలలో వచ్చేస్తోంది. కంపెనీ ఎక్కువగా కెమెరాలపైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తోంది. ఈ ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్, 1,800 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌ అందిస్తుంది. కాంపాక్ట్ 6.32-అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లే ఉండొచ్చు. ఈ డివైజ్‌కు స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్, LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్‌తో పవర్ అందించవచ్చు.

నథింగ్ ఫోన్ 4b: ఫీచర్లు, అంచనాలు

అంతేకాదు.. కెమెరా కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ మూడు 50MP సెన్సార్లు ఉంటాయని అంచనా. ప్రైమరీ, అల్ట్రావైడ్, 3.5x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ లెన్స్ అందిస్తుంది. ఫ్రంట్ కెమెరా కూడా 50MP సెన్సార్‌తో వస్తుందని అంచనా. ఈ ఫోన్ సెల్ఫీలకు అద్భుతమైన ఆప్షన్.

Read Also : Urtopia e-bike : సూపర్ బైక్ చూశారా? అర్టోపియా కార్బన్ ఆటమ్ ఇ-బైక్ అదుర్స్.. సింగిల్ ఛార్జ్‌తో 95కి.మీ దూసుకెళ్లగలదు!

ఈసారి, ఒప్పో రెనో 16తో పాటు బబుల్ మ్యాగ్ ఇ-బ్యాడ్జ్‌ను కూడా లాంచ్ చేస్తోంది. మీ స్మార్ట్‌ఫోన్ బ్యాక్ సైడ్ మ్యాగ్నెట్ స్టిక్ అయి ఉంటుంది. దాంతో బ్యాక్ కెమెరాల లైవ్ ప్రివ్యూను చూడొచ్చు. మీరు సెల్ఫీలు, వీడియో కాల్స్ హై క్వాలిటీ కోసం మెయిన్ కెమెరాను వాడుకోవచ్చు. రెనో 16లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 6,700mAh బ్యాటరీ ఉంటుంది.

వన్‌ప్లస్ N6 : జూన్ 30న వన్‌ప్లస్ N6 ఫోన్ లాంచ్ కానుంది. కంపెనీ ఇప్పటికే వెబ్‌సైట్‌లో కొన్ని అంచనా ఫీచర్లతో టీజ్ చేసింది. కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం.. వన్‌ప్లస్ N6 ఫోన్ 8,000mAh బ్యాటరీతో వస్తుంది. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు సింగిల్ ఛార్జ్‌పై 2 రోజుల వరకు రన్ అవుతుంది. ఈ ఫోన్‌లో 120Hz డిస్‌ప్లే, భారీ 5.3K VC కూలింగ్ సిస్టమ్, 8MP సెల్ఫీ స్నాపర్‌తో 50MP డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ వంటి ఫీచర్లు ఉంటాయని కంపెనీ ధృవీకరించింది.

లీకుల ప్రకారం.. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ చిప్ ఉంటుందని అంచనా. దీనిపై కచ్చితమైన వివరాలు ఇంకా రివీల్ కాలేదు. ఈ ఫోన్ ధర రూ. 20వేలు లోపు ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. స్పెసిఫికేషన్లను బట్టి పరిశీలిస్తే.. వన్‌ప్లస్ N6 ఫోన్ అత్యంత పవర్‌ఫుల్ బ్యాటరీ-సెంట్రలైజడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా ఉండనుంది.

ఒప్పో రెనో 16: కెమెరా ప్రత్యేకతలు

శాంసంగ్ గెలాక్సీ M47 సిరీస్ : శాంసంగ్ ఎమ్ సిరీస్ ఫోన్ అద్భుతమైన ఫోన్. ఈ కొత్త గెలాక్సీ M47 మోడల్ అతి త్వరలో లాంచ్ కానుంది. శాంసంగ్ వెబ్‌సైట్‌ అధికారిక లిస్టు ప్రకారం.. శాంసంగ్ గెలాక్సీ M47 ఫోన్ 6.7 అంగుళాల సైజులో 120Hz సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్‌తో పాటు LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్‌తో వస్తుందని అంచనా.

కెమెరా సెటప్‌లో 50MP మెయిన్ కెమెరా, 5MP అల్ట్రావైడ్ కెమెరా, 2MP మాక్రో సెన్సార్ ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ సైడ్ 12MP స్నాపర్ ఉండొచ్చు. బ్యాటరీ సామర్థ్యం 5,000mAh ఉంటుందని అంచనా. అయితే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు అందిస్తుంది. ఈ ఫోన్ గెలాక్సీ M47 ఫోన్ 6 ఏళ్ల మెయిన్ OS అప్‌డేట్‌లతో పాటు 6 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లతో రానుంది.

టెక్నో కామన్ స్లిమ్ : టెక్నో కామన్ స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌ అతి త్వరలో రాబోతుంది. ఈ ఫోన్ 6.39mm థిన్ లైట్ వెర్షన్ కాగా స్పెసిఫికేషన్లు ముందుగానే లీక్ అయ్యాయి. టెక్నో కామన్ స్లిమ్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుందని అంచనా. హీలియో G200 అల్టిమేట్ చిప్‌సెట్ ఉండవచ్చు. 8GB ర్యామ్, 256GB వరకు స్టోరేజ్‌తో రావచ్చు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16.2తో వస్తుందని అంచనా.

కెమెరా విషయానికొస్తే.. టెక్నో 50MP సోనీ LYT-600 సెన్సార్‌తో పాటు, అల్ట్రా-వైడ్ సెన్సార్ లేదా డెప్త్ సెన్సార్, సెకండరీ సెన్సార్‌ ఉండొచ్చు. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చు.

కామన్ స్లిమ్‌లో 60W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌, 5,600mAh బ్యాటరీ ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌లో IP68, IP69 రేటింగ్‌, మిలిటరీ-గ్రేడ్ మన్నిక, స్టీరియో స్పీకర్లు, NFC, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉండొచ్చు.

జూలైలో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లు బడ్జెట్ ధరలో ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి. నథింగ్ ఫోన్ 4b, ఒప్పో రెనో 16 వంటివి డిజైన్, కెమెరా ప్రత్యేకతలతో ఆకట్టుకోనున్నాయి. మీ అవసరాలకు తగ్గ బెస్ట్ ఫోన్ ఎంచుకోవడానికి ఇది సరైన అవకాశం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.