
ప్రతిభావంతురాలైన సాయి పల్లవి తన కెరీర్‌లో ఎన్నో విజయాలను సాధించింది. అయితే, ఆమె ఇటీవల రూ. 600 కోట్ల కలెక్షన్స్ సినిమాలో నటించే అవకాశాన్ని వదులుకున్న విషయం తెలిసింది. అంతేకాదు, లియో చిత్రంలోనూ నటించే అవకాశం ఆమె వద్ద ఉండగా, ఆమె దానిని కూడా తిరస్కరించింది.
Key Points
సాయి పల్లవికి రూ. 600 కోట్ల కలెక్షన్స్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.
లియో చిత్రంలో విజయ్ సరసన నటించే అవకాశాన్ని ఆమె వదులుకుంది.
చిరంజీవి సినిమాలో నటించే అవకాశాన్ని కూడా సాయి పల్లవి తిరస్కరించింది.
రామాయణం చిత్రంలో సీత పాత్రలో నటిస్తూ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
సాయి పల్లవి కెరీర్ జర్నీ
ప్రతిభకు అదృష్టం తోడైతే అది నటి సాయి పల్లవి అవుతుంది. డాక్టర్ అయ్యి యాక్టర్ అయిన భామ ఈమె. సినిమాలపై ఆసక్తితో మొదట్లో ప్రయత్నాలు చేసిన ఆశించిన ఫలితం దక్కకపోవడంతో వైద్య విద్యపై పూర్తిగా దృష్టి సారించిన సాయి పల్లవి మధ్యమధ్యలో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ తన కలలబాటలో పయనించిన సాయి పల్లవికి మలయాళ చిత్రం ప్రేమమ్‌తో విజయం వరించింది. ఆ ఒక్క విజయం ఆమె కెరీర్నే మార్చేసింది వరుసగా అవకాశాలు రావడం, అందులో బలమైన, నటనకు అవకాశం ఉన్న పాత్రలను ఎంచుకొని నటించడంతో సాయి పల్లవి తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.
లియో చిత్రం & సాయి పల్లవి నిర్ణయం
అలాంటి పాత్రలు తెలుగులోనే ఎక్కువగా రావడం విశేషం. కాగా ఇటీవల తమిళంలో శివకార్తికేయన్‌కు జంటగా నటించిన అమరన్ చిత్రంలో సాయి పల్లవి నటన మరోసారి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా తాజాగా ఈమె బాలీవుడ్‌ని కూడా టచ్ చేసింది. అక్కడ పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న రామాయణం చిత్రంలో సీతగా నటిస్తోంది. ఈ సినిమాపై చాలా అంచనాలు నెలకొంటున్నాయి. ఇందులో సాయి పల్లవి నటించిన కొన్ని గ్లింప్స్ విడుదలై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కాగా ఈమె ఈ చిత్రానికి భారీ మొత్తంలో పారితోషకం పుచ్చుకుంటున్నట్లు, ఎంత అంటే ఇప్పటి వరకు ఏ దక్షిణాది హీరోయిన్ తీసుకోనంత అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.
రామాయణం చిత్రం & భారీ పారితోషికం
ఇకపోతే ఈమె కథ, తన పాత్ర నచ్చితే కానీ చిత్రాలను అంగీకరించరన్నది తెలిసిందే. ఇంతకు ముందు చిరంజీవితో నటించే అవకాశాన్ని తిరస్కరించింది. అదేవిధంగా తమిళంలో నటుడు విజయ్ సరసన లియో చిత్రంలో నటించే అవకాశం ముందు సాయిపల్లవికే వచ్చిందట. అందులో ఆమె నటించడం దాదాపు ఖరారు అయ్యిందని, అయితే అందులో పాత్ర తనకు సంతృప్తిని కలిగించకపోవడంతో నిరాకరించినట్లు తాజాగా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.ఆ తరువాత ఆ పాత్రను నటి త్రిష పోషించింది.
చివరకు, సాయి పల్లవి తన నటనకు ప్రాధాన్యత ఇస్తూ, తనకు నచ్చిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటోంది. ఆమె నిర్ణయాలు ఆమె ప్రత్యేకతను తెలియజేస్తున్నాయి.


