|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సల్మాన్ ఖాన్ గ్యారేజ్ లో అదరిపోయే కొత్త కారు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.

Published: 22-06-2025, 2:44 AM
సల్మాన్ ఖాన్ గ్యారేజ్ లో అదరిపోయే కొత్త కారు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన గ్యారేజ్ కు మరో విలాసవంతమైన కారును చేర్చారు. అది ఏమిటో, ఎంత ఖరీదో తెలుసుకుందాం.

Key Points

1

సల్మాన్ ఖాన్ కొత్త మెర్సిడెస్-మేబాచ్ GLS 600 SUV కారు కొన్నారు.

2

కారు ధర రూ.3.39 కోట్లు (ఎక్స్-షోరూమ్), కస్టమైజేషన్‌తో రూ.5 కోట్లకు పైగా ఉండొచ్చు.

4

బుల్లెట్ ప్రూఫ్ ఫీచర్స్ ఉండే అవకాశం ఉందని అభిమానులు అనుకుంటున్నారు.

సల్మాన్ ఖాన్ కొత్త కారు

బాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరోలలో సల్మాన్ ఖాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమాల్లో హీరోయిజం చూపించడం మాత్రమే కాదు 60 ఏళ్లు వస్తున్నా.. ఏమాత్రం తగ్గకుండా అదే ఫిట్ నెస్ తో, న స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు ఖాన్. అంతే కాదు కాస్ట్లీ లైఫ్ స్టైల్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు సల్మాన్ ఖాన్.

కొత్త కారు కొన్న సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ వాడే వస్తువులు, కార్లు అన్నీ కోట్లలోనే ఉంటాయి. ఇప్పటికే ఆయన గ్యారేజ్ లో విలువైన కార్లు బోలెడు ఉండగా.. తాజాగా అందులోకి మరో కాస్ట్లీ కారు వచ్చి చేరింది. అవును రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తన లగ్జరీ కార్ల కలెక్షన్‌లోకి మరో ఖరీదైన కారును చేర్చారు. అదే మెర్సిడెస్-మేబాచ్ GLS 600 SUV.

ఈ లగ్జరీ కారులో సల్మాన్ ఖాన్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో కూర్చుని బయటకి వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫ్యాన్స్ గమనించిన మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే కారుపై ఉన్న 2024 రిజిస్ట్రేషన్ స్టిక్కర్. దీని ద్వారా ఇది రీసెంట్ గానే రిజిస్టర్ చేయబడినది గా తెలుస్తోంది.

మెర్సిడెస్-మేబాచ్ GLS 600 SUV విశేషాలు

సల్మాన్ ఖాన్ కారు కాస్ట్ ఎంతంటే?

మెర్సిడెస్-మేబాచ్ GLS 600 SUV బేస్ వేరియంట్ ధర రూ.3.39 కోట్లుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ప్రైస్ మాత్రమే. ఇతర కస్టమైజేషన్, బుల్లెట్ ప్రూఫ్ ఫీచర్లు కలిపితే దీని ధర రూ.5 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. గతంలో సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే, ఈ కారులో బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది అని అభిమానులు అంటున్నారు.

ఈ లగ్జరీ SUV సల్మాన్ ఖాన్  వ్యక్తిత్వానికి తగ్గట్టుగా బోల్డ్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, సూపీరియర్ ఇంటీరియర్ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది. సల్మాన్ ఖాన్ ఎప్పటికప్పుడు తన లైఫ్ స్టైల్ తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. కొత్త కొత్త మెరుపులతో అలరిస్తుంటారు. ఈక్రమంలో మెర్సిడెస్ మేబాచ్ GLS 600 కారుతో మరోసారి చర్చనీయాంశం అయ్యారు సల్మాన్.

ఇది సల్మాన్ ఖాన్ కలెక్షన్‌లో ఉన్న తొలి విలాసవంతమైన కారు కాదు. ఇప్పటికే ఆయన దగ్గర కాస్ట్లీ కార్లు చాలా ఉన్నాయి.

కారు ధర మరియు ఫీచర్లు

టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200

బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్

మెర్సిడెస్-బెంజ్ AMG GLE కూపే

చివరిగా, సల్మాన్ ఖాన్ తన ఖరీదైన కార్ల సేకరణకు మరో విలువైన వస్తువును జోడించారు. ఈ కొత్త కారు ఆయన లగ్జరీ జీవనశైలికి నిదర్శనం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.