|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సల్మాన్ ఖాన్ మూవీలో ఊహించని ట్విస్ట్! వంశీ ప్లాన్ అదిరిందిగా!!

Published: 02-04-2026, 6:30 AM
సల్మాన్ ఖాన్ మూవీలో ఊహించని ట్విస్ట్! వంశీ ప్లాన్ అదిరిందిగా!!
  • సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మాణంలో సినిమా.
  • ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం.
  • అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.
  • అనిల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా, అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ మూవీ

Salmankhan Vamsi Paidipalli: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన వంశీ పైడిపల్లి (Vamsi Paidipalli)ప్రస్తుతం ఇతర భాష హీరోలతో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసినదే. ప్రస్తుతం ఈయన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్(Salman Khan) తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే .గత కొంతకాలంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ సినిమా ఏప్రిల్ నెల నుంచి షూటింగ్ పనులను జరుపుకుంటుంది అంటూ ఇదివరకు చిత్ర నిర్మాతలు వెల్లడించారు అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్టులో లేడీస్ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటించబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారకంగా తెలియజేశారు. ఇలా సల్మాన్ ఖాన్ నయనతార కాంబినేషన్లో సినిమా అంటేనే భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరొక వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో మరో సౌత్ ఇండియన్ సీనియర్ స్టార్ హీరో కనిపించబోతున్నట్టు సమాచారం.

కీలక పాత్రలో అరవింద్ స్వామి..

హీరోయిన్‌గా నయనతార.. భారీ అంచనాలు

సౌత్ సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అరవింద్ స్వామి (Aravind Swamy)ఒకరు. ఇటీవల కాలంలో ఈయన సినిమాలను పూర్తిగా తగ్గించారు. కేవలం కీలక ప్రాధాన్యత ఉన్న సినిమాలలో, విలన్ పాత్రలలోను నటిస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ధ్రువ సినిమాతో విలన్ గా తన నటనతో మరోసారి ప్రేక్షకులను మెప్పించిన అరవింద్ స్వామి ఈసారి సల్మాన్ ఖాన్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో ఈయన విలన్ పాత్రలో కాకుండా కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తుంది.

సల్మాన్ ఖాన్ విలన్ గా అనిల్ కపూర్?

కీలక పాత్రలో అరవింద్ స్వామి?

ఈ సినిమా కథ మొత్తం అరవింద్ స్వామి పాత్ర ద్వారా కీలక మలుపు తిరగబోతుందని అలాంటి ఒక ముఖ్యమైన పాత్రలో అరవింద్ స్వామి నటించబోతున్నట్లు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ సినిమాలో అరవింద్ స్వామి నటించబోతున్నారని వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాలి అంటే చిత్రబృతం స్పందించాల్సి ఉంది. ఇక ఇందులో అనిల్ కపూర్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా వంశీ పైడిపల్లి స్టార్ సెలబ్రిటీలు అందరినీ ఈ సినిమాలో భాగం చేయబోతున్నారని తెలుస్తోంది.ఇలా ఈ సినిమా గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంత నిజం ఉంది అనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారిక ప్రకటన ఇచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

సల్మాన్ ఖాన్ సినిమాలో అరవింద్ స్వామి నటిస్తారా లేదా అనేది తెలియాలంటే చిత్రబృందం స్పందించే వరకు వేచి చూడాల్సిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.