
📌 Key Points
- శివాజీ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించడంతో వివాదం రాజుకుంది.
- అనసూయ చీర కట్టుకోవడంపై న్యూస్ ఛానల్ చేసిన పోస్ట్‌కు ఆమె వ్యంగ్యంగా కౌంటర్ ఇచ్చారు.
- శివాజీ సృష్టించిన చీర అంటూ అనసూయ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
- గతంలో చీర కట్టుకోలేదన్న విమర్శలకు అనసూయ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
అనసూయ భరద్వాజ్ మరోసారి చీర వివాదంపై స్పందించారు. నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
శివాజీ వ్యాఖ్యలపై అనసూయ కౌంటర్
Anasuya Bharadwaj: అనసూయ భరద్వాజ్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన విషయాల గురించి మాత్రమే కాకుండా, ఇండస్ట్రీలో జరుగుతున్న అంశాల గురించి అలాగే మహిళలకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తుంటారు. అయితే ఇటీవల నటుడు శివాజీ (Sivaji)మహిళల వస్త్రధారణ గురించి ఓ సినిమా వేడుకలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై అనసూయ (Anasuya)ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో శివాజీ వర్సెస్ అనసూయ అనే విధంగా వివాదం చెలరేగింది.
శివాజీ ఒక సినిమా వేడుకలలో మాట్లాడుతూ హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు బట్టలు సరిగ్గా వేసుకోండి అంటూ కొన్ని అభ్యంతరకరమైన పదాలు మాట్లాడటంతో ఈయనపై చాలామంది విమర్శలు కురిపించారు. ఇక ఈ విషయంలో అనసూయ కాస్త ఘాటుగా రియాక్ట్ అవ్వడంతో ఈమె పట్ల కూడా చాలామంది విమర్శలు చేశారు. ఇక ఈ వివాదం ముగిసిపోయిందనుకున్న తరుణంలో మరోసారి అనసూయ శివాజీ చీర వివాదం గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనగా మారింది. ఈ నేపథ్యంలోనే అనసూయ తన అధికారిక ఎక్స్ వేదికగా “శివాజీ సృష్టించిన చీర” అంటూ వ్యంగంగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.
ఇటీవల అనసూయ తన భర్తతో కలిసి ఒక ఆలయానికి వెళ్లారు అయితే ఆమె చాలా పద్ధతిగా చీర కట్టుకొని గుడికి వెళ్ళగా ఈ వీడియో క్లిప్ ను ఒక న్యూస్ ఛానల్ ప్రసారం చేస్తూ.. శివాజీ దెబ్బతో పట్టుచీరలో తిరుగుతున్న అనసూయ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే అనసూయ ఈ వీడియోని తన ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ..”తప్పు తప్పు.. శివాజీ సృష్టించిన చీర అనే వస్త్రాన్ని ధరించి తిరుగుతున్న అనసూయ.. ఇది కదా ఉండాలి ఎందుకంటే అంతకుముందు మేమంతా అసలు చీరలే కట్టుకోలేదు.. ఏంటమ్మా పోస్ట్ చేసే ముందు చూసుకోవాలి ” కదా అంటూ తనదైన స్టైల్ లోనే ఈమె కౌంటర్ ఇస్తూ పోస్ట్ చేశారు.
వైరల్ అవుతున్న అనసూయ పోస్ట్
Tappu tappu! “Sivaji srushtinchina cheera ane vastraanni dharinchi tirugutunna Anasuya” Idi kada undali header!! Endukante antaku mundu memanta asalu cheerale kattukoledu 🙄 entamma.. chuskovali kada post chesemundu 🤦🏻♀️ https://t.co/9IiFZ7PQgh
— Anasuya Bharadwaj (@anusuyakhasba) April 11, 2026
అనసూయ స్టైల్లో సమాధానం
ప్రస్తుతం అనసూయ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .ఇంతకుముందు తాను ఎప్పుడు చీర కట్టుకోలేదని, శివాజీ చెప్పిన తర్వాతనే చీర కట్టుకొని తిరుగుతున్నట్టు మాట్లాడటంతో అనసూయ తనదైన స్టైల్ లోనే ఘాటుగా స్పందిస్తూ చీరను శివాజీని సృష్టించారు అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇలా మరోసారి ఈమె శివాజీ పేరును ప్రస్తావిస్తూ చీర గురించి మాట్లాడటంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. మరి ఈ కామెంట్స్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా ఎప్పటికప్పుడు మహిళల వస్త్రధారణ గురించి సోషల్ మీడియాలో వచ్చే విమర్శలపై అనసూయ స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.
మొత్తానికి అనసూయ ఈ వివాదంపై తనదైన శైలిలో స్పందిస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.


