|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సమ్మక్క జాతరలో సమంత, రాజ్ ల సందడి! ఫోటోలు చూస్తే షాక్ అవుతారు! వైరల్ పిక్స్!

Published: 01-02-2026, 5:05 AM
సమ్మక్క జాతరలో సమంత, రాజ్ ల సందడి! ఫోటోలు చూస్తే షాక్ అవుతారు! వైరల్ పిక్స్!
  • సమంత, రాజ్ నిడిమోరు సమ్మక్క సారలమ్మ గద్దెల దర్శనం: వైరల్ అవుతున్న కొత్త ఫోటోలు!
  • పసుపు పచ్చ చీరలో సమంత, వైట్ ధోతిలో రాజ్: సాంప్రదాయ దుస్తుల్లో క్యూట్ జంట!
  • సమంత, రాజ్ ల పెళ్లి ఫోటోపై నెటిజన్ల కామెంట్స్: ఇది ఏఐ ఫోటోనా?
  • ‘మా ఇంటి బంగారం’ సినిమాలో సమంత: నందిని రెడ్డి దర్శకత్వంలో గుల్షన్ దేవయ్య విలన్!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు సమ్మక్క సారలమ్మ జాతరలో దర్శనమిచ్చారు. వీరి క్యూట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం రండి!

సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సమంత, రాజ్ సందడి!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘ఏమాయ చేశావే’(Ye Maya Chesave) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. ఇండస్ట్రీకి వచ్చిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌కి వెళ్లిపోయింది. ఇక అక్కినేని హీరో నాగచైతన్య(Naga Chaitanya)తో ప్రేమలో పడి అతన్నే మ్యారేజ్ చేసుకున్న ఈ బ్యూటీ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత రీసెంట్‌గా బాలీవుడ్ దర్శకుడు రాజ్‌ నిడిమోరు(Raj Nidimoru)తో పెళ్లిపీటలెక్కింది.

కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో యోగా ఆశ్రమంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో వీరి పెళ్లి జరిగింది. ఇక మ్యారేజ్ తర్వాత మళ్లీ తమ ప్రొఫెషనల్ వర్క్స్‌లో బిజీ అయిపోయింది సమంత. ‘శుభం’(Shubham) సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్న సామ్ ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’(Ma Inti Bangaram) సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు కూడా సామ్‌నే నిర్మాతగా వ్యవహరిస్తోంది. దీనికి లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు కాంతార విలన్ గుల్షన్ దేవయ్య, దివ్యేందు కీలక పాత్రలో నటిస్తున్నారు.

ట్రెడిషనల్ లుక్స్‌లో సమంత, రాజ్: వైరల్ అవుతున్న ఫోటోలు!

ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ అని మనందరికీ తెలిసిందే. ఈ జాతరకు భక్తులు అమ్మవార్లకు బంగారం(బెల్లం)సమర్పించుకుంటారు. ఈ క్రమంలో కొత్తగా పెళ్లి అయిన సమంత-రాజ్ నిడిమోరు కూడా సమ్మక్క సారలమ్మ గద్దెలను దర్శించుకున్నట్లు ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. సమంత పసుపు పచ్చ చీర కట్టుకొని ఉండగా రాజ్ మాత్రం వైట్ కలర్ ధోతిలో ఉన్నాడు. ఇక వీరిద్దరిపై పసుపు కుంకుమ పడి ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారగా.. ఇది ఏఐ ఫొటో అని కామెంట్స్ చేస్తున్నారు.

ఏఐ ఫోటోనా? నెటిజన్ల అనుమానాలు!

A post shared by ZEE Telugu News (@zeetelugunews)

సమంత, రాజ్ ల ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని టాలీవుడ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.